మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. PhonePe Wealth కొత్త టూల్‌ CRISP తో తెలివైన పెట్టుబడులకు అవకాశం..

ఇండియాలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2019 చివరికి 2 కోట్ల మంది మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టగా‌. 2024 చివరి నాటికి ఈ సంఖ్య 5.3 కోట్లకు పెరిగింది. అయితే, సరైన ఫండ్ ఎంపిక చేయడం ఇప్పటికీ చాలామందికి సవాలుగానే మారింది. ఈ సమస్యకు పరిష్కారంగా PhonePe Wealth ఇప్పుడు CRISP అనే కొత్త టూల్‌ను తీసుకువచ్చింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

CRISP అంటే ఏమిటి?

CRISP అంటే Consistency, Risk, and Investment Style of the Portfolio. సాధారణంగా, చాలామంది ఇన్వెస్టర్లు ఒక మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకునే సమయంలో గత రాబడులపై ఆధారపడతారు.

Related News

కానీ, ఫండ్ ఎంపికలో ఇది సరైన పద్ధతి కాదు. CRISP ఈ సమస్యను పరిష్కరిస్తుంది. మ్యూచువల్ ఫండ్ల పనితీరు, రిస్క్, పెట్టుబడి విధానాన్ని విశ్లేషిస్తుంది. విశ్లేషించి ఇన్వెస్టర్లకు సులభంగా అర్థమయ్యే రీతిలో సమాచారం అందిస్తుంది.

CRISP టూల్ ఎలా సహాయం చేస్తుంది?

CRISP టూల్ ప్రధానంగా మూడు అంశాల ఆధారంగా మ్యూచువల్ ఫండ్లను అంచనా వేస్తుంది:

  1. Consistency in Performance (స్థిరమైన పనితీరు) – ఈ టూల్ ఒక ఫండ్ గత ఐదేళ్లలో ఎప్పటికప్పుడు ఎలా రాబడి ఇచ్చిందో విశ్లేషిస్తుంది. అలా చేసి, ఫండ్ “హై”, “మీడియం”, “లో” లాంటి రేటింగ్స్‌తో ఇన్వెస్టర్లకు క్లారిటీ ఇస్తుంది. ఈ విధంగా, ఏ ఫండ్ నిలకడగా మంచి రాబడి ఇస్తుందో సులభంగా తెలుసుకోవచ్చు.
  2. Risk Assessment (రిస్క్ లెవెల్) – ప్రతి మ్యూచువల్ ఫండ్‌లో ఉండే రిస్క్ స్థాయిని ఇతర ఫండ్లతో‌ పోలుస్తుంది. పోల్చి, అది సాధారణ స్థాయిలో ఉందో లేక అధికంగా ఉందో సూచిస్తుంది. దీని ద్వారా, అధిక రిస్క్ ఉన్న ఫండ్లను సమర్థంగా నివారించవచ్చు.
  3. Investment Style Analysis (పెట్టుబడి విధానం) – ఫండ్‌ మేనేజర్ పెట్టుబడులను ఎలా వినియోగిస్తున్నాడు?. ఆ ఫండ్ వేల్యూ, క్వాలిటీ, మోమెంటం లాంటి పెట్టుబడి స్టైల్‌లను ఎలా అనుసరిస్తుంది?. అనే విషయాలను ఈ టూల్ విశ్లేషిస్తుంది. ఈ విలువైన సమాచారం ఇన్వెస్టర్లకు సరైన డైవర్సిఫికేషన్ పొందడంలో సహాయపడుతుంది.

ఈ CRISP ఎక్కడ లభిస్తుంది?

ప్రస్తుతం CRISP టూల్ PhonePe Wealth ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. త్వరలోనే ఇది Share Market స్టాక్ బ్రోకింగ్ ప్లాట్‌ఫామ్‌లో కూడా అందుబాటులోకి రానుంది. ఈ టూల్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్‌ను మరింత బాగా అర్థం చేసుకునేలా చేస్తుంది.

PhonePe Wealth గురించి

PhonePe Wealth Broking Private Limited 2021లో స్థాపించబడింది. ఇది PhonePe Private Limited యొక్క ఉప సంస్థ. స్టాక్ బ్రోకర్‌గా NSE, BSEలో రిజిస్టర్ అయ్యి, SEBI పరిశోధన విశ్లేషకుడిగా ఉండి. AMFI ద్వారా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తోంది. Share Market అనే ప్లాట్‌ఫామ్ ద్వారా స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, WealthBaskets వంటి వివిధ పెట్టుబడి అవకాశాలను ఇన్వెస్టర్లకు అందిస్తోంది.

మార్కెట్‌లో సరైన పెట్టుబడులు పెట్టడం మీకు కష్టం అనిపిస్తుందా? అయితే PhonePe Wealth కొత్త టూల్‌ CRISP ను ఉపయోగించి తెలివిగా పెట్టుబడులు పెట్టండి.