గుంటూరు జిల్లాకు కేంద్రం శుభవార్త చెప్పింది. రూ.143 కోట్లు మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. మిగిలిన జిల్లాలకు రూ.80.41 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 20 రోడ్ల పనులకు కేంద్రం ఈ నిధులను మంజూరు చేసిందని పెమ్మసాని పేర్కొన్నారు. ఐదేళ్లు పాలించిన జగన్ ప్రభుత్వం రోడ్ల నిర్మాణాన్ని విస్మరించిందని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రోడ్లను మరమ్మతు చేస్తామని హామీ ఇచ్చిందని ఆయన అన్నారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు రాష్ట్రంలోని రోడ్లకు అవసరమైన నిధులను కేంద్రం నుంచి తెస్తున్నామని పెమ్మసాని పేర్కొన్నారు.
GUNTUR: గుంటూరు జిల్లాకు గుడ్ న్యూస్.. రూ. 143 కోట్లు మంజూరు

02
Mar