ఈ మార్పుతో ఎవరికీ లాభం?
ఈ కొత్త నిర్ణయం చిన్న పెట్టుబడిదారులు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు పెద్ద ఊరట కలిగించనుంది. ఎందుకంటే, TDS మినహాయింపు పరిమితి పెరగడం వల్ల, వారి చేతిలో ఎక్కువ డబ్బు మిగులుతుంది. దీంతో, పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినప్పటికీ, కొంతవరకు ట్యాక్స్ మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది.
TDS అంటే ఏమిటి?
Tax Deducted at Source (TDS) అనేది ప్రత్యక్షంగా ఆదాయంపై పెనాల్టీ విధించే విధానం. ఇది ఉద్యోగ వేతనం, FD వడ్డీ, అద్దె ఆదాయం మొదలైన వాటికి వర్తిస్తుంది. ఈ పద్ధతితో ప్రభుత్వం పన్ను ఎగవేతను అరికట్టే ప్రయత్నం చేస్తుంది.
FD వడ్డీపై TDS ఎలా పని చేస్తుంది?
మీరు బ్యాంకులో FD చేయినప్పుడు, మీకు వచ్చే వడ్డీ ఆదాయంపై ప్రభుత్వం కొన్ని షరతులతో TDS విధిస్తుంది. మీ వడ్డీ ఆదాయం నిర్ణీత పరిమితిని మించి ఉంటే బ్యాంక్ TDS కోత విధిస్తుంది. బ్యాంక్ ఈ కోత చేసిన TDS మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తుంది. మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) ఫైలింగ్ చేసేటప్పుడు, బ్యాంక్ ఇచ్చే TDS సర్టిఫికేట్ ఉపయోగించుకోవచ్చు.
Related News
కొత్త TDS పరిమితులు – FD పెట్టుబడిదారులకు బిగ్ రీలీఫ్
కొత్త మార్పుల ప్రకారం సాధారణ FD పెట్టుబడిదారులకు – TDS పరిమితి ₹40,000 నుండి ₹50,000కి పెరిగింది. సీనియర్ సిటిజన్లకు – పాత పరిమితి ₹50,000 ఉండగా, ఇప్పుడు దాన్ని ₹1,00,000కి పెంచారు. ఈ కొత్త మార్పు వల్ల సీనియర్ సిటిజన్లు FD వడ్డీపై మరింత మినహాయింపు పొందుతారు. వారి ఆదాయంపై TDS బాదుడు లేకుండా FD పెట్టుబడులను సులభంగా చేసుకోవచ్చు.
ఈ TDS పెంపు నిర్ణయం వల్ల ఎక్కువ మంది మదుపర్లు తమ పెట్టుబడులను FD లో పెట్టేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఇప్పటికే FD పై బ్యాంకులు మంచి వడ్డీ అందిస్తున్నాయి. కాబట్టి, కొత్త రూల్స్‌లో మీకు ఎంత లాభం వస్తుందో తెలుసుకొని పెట్టుబడి పెట్టండి.