Raithu Bharosa: మూడెకరాలలోపు రైతులకు గుడ్ న్యూస్..అకౌంట్లలో డబ్బులు జమ

తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మూడు ఎకరాల వరకు సాగు భూములకు ఎకరానికి రూ. 6,000 రైతు భరోసా నిధులను జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఈ రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం జనవరి 26న ప్రభుత్వ నిధులను జమ చేయడం ప్రారంభించింది. ఫిబ్రవరి 5న 17.03 లక్షల మందికి, ఫిబ్రవరి 10న 8.65 లక్షల మందికి విడతలవారీగా నిధులు జమ చేసినట్లు ప్రకటించారు.

Related News

ఇప్పటివరకు, 2 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న 34 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 2200 కోట్లు జమ అయ్యాయి.

మొత్తం 37 లక్షల ఎకరాలకు పెట్టుబడి సహాయం నగదు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది.