మంత్రి అచ్చన్నాయుడు ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రకటించారు. రూ.48,340 కోట్ల కేటాయింపును ప్రతిపాదిస్తున్నట్లు ఆయన చెప్పారు. వ్యవసాయ రంగంలో 15 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అచ్చన్నాయుడు చెప్పారు. 11 పంటలను వృద్ధి చోదకాలుగా తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి తమ ప్రభుత్వం 7. 78 లక్షల క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేసిందని ఆయన అన్నారు. విత్తన సబ్సిడీ బకాయిలు రూ.120 కోట్లు చెల్లించామని ఆయన అన్నారు. ఎరువుల నిర్వహణకు రూ.40 కోట్లు, సహజ వ్యవసాయానికి రూ.61 కోట్లు, యంత్రాల సబ్సిడీకి రూ.139. 65 కోట్లు, డ్రోన్ సబ్సిడీలకు రూ.80 కోట్లు, కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాల ఏర్పాటుకు రూ.875 కోట్లు, రైతులకు వడ్డీ లేని రుణాలకు రూ.250 కోట్లు, కొత్త కౌలు చట్టాన్ని తీసుకురావడానికి చర్యలు తీసుకున్నట్లు మంత్రి అచ్చన్నాయుడు ప్రకటించారు.
అలాగే SC, ST లకు ఉచిత విద్యుత్ రూ. 400 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకం రూ. 6.300 కోట్లు, ధరల స్థిరీకరణ నిధి రూ. 300 కోట్లు, నీటిపారుదల ప్రాజెక్టులు రూ. 11, 314 కోట్లు, పోలవరం నిర్మాణం రూ. 6,705 కోట్లు, భూమిలేని కౌలు రైతులకు కూడా సంవత్సరానికి రూ. 20 వేలు ఇస్తున్నట్లు మంత్రి అచ్చెన్న స్పష్టం చేశారు. ఉద్యానవన శాఖకు రూ. 930.88 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ. 12,401 కోట్లు, పంట బీమా పథకానికి రూ. 1.028 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి అచ్చెన్న స్పష్టం చేశారు.