ముఖ్య వివరాలు
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాన్ని ఎంప్లాయ్‌మెంట్ మంత్రిత్వ శాఖ సెక్రటరీ సుమితా దావ్రా గత వారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) లో నిర్వహించిన 113వ ఎగ్జిక్యూటివ్ కమిటీ (EC) సమావేశంలో ఆమోదించారు. ఈ నిర్ణయంతో EPFO సభ్యుల జీవితంలో మరింత సౌలభ్యం కలుగనుంది.
ఈ సమావేశం మార్చి 28న జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరిగింది. దీనికి EPFO సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రమేష్ కృష్ణమూర్తి కూడా హాజరయ్యారు. ఇప్పుడు ఈ ప్రతిపాదన CBT ముందు పెట్టి తుది ఆమోదం పొందాల్సి ఉంది.
UPI & ATM ద్వారా PF విత్‌డ్రాయల్
2025 మే నెలాఖరు లేదా జూన్ ప్రారంభంలో EPFO సభ్యులు PF డబ్బును తక్షణమే ఉపసంహరించుకునే అవకాశం రానుంది. ఇకపై ఉద్యోగులు తమ PF బ్యాలెన్స్‌ను చెక్ చేయడమే కాకుండా, నేరుగా UPI లేదా ATM ద్వారా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇటీవల సుమితా దావ్రా, ఈ విషయాన్ని ధృవీకరించడంతో ₹1 లక్ష వరకు తక్షణం డ్రా చేసుకునే అవకాశం వస్తుంది. దీనివల్ల ఉద్యోగులకు తక్షణ అవసరాలకు డబ్బు వెనువెంటనే అందేలా ఉంటుంది.
Related News
మీ PF డబ్బును ఇలా విత్‌డ్రా చేసుకోవచ్చు
PF బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి UPI అనుసంధానం ద్వారా ఆప్షన్ రానుంది. ATM ద్వారా డబ్బు తీసుకునే సౌలభ్యం త్వరలో అందుబాటులోకి రానుంది. ఆటో సెటిల్‌మెంట్ లిమిట్ పెరగడం వల్ల, క్లెయిమ్ చేసే అవసరమే లేకుండా సరళంగా డబ్బు మీ ఖాతాలోకి వస్తుంది.
ఈ మహత్తర మార్పులు త్వరలో అధికారికంగా ప్రకటించబోతున్నారు. మీ PF డబ్బును ఎంత సులభంగా పొందొచ్చో ఊహించండి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి.