EPFO సేవలు మరింత వేగంగా
ఈ 15 కొత్త బ్యాంకుల జోడింపుతో పెట్టుబడిదారులు తాము ఉన్న బ్యాంకుల నుంచే నేరుగా EPFO సేవలు పొందే వెసులుబాటు లభించనుంది. ఇది పెన్షన్ సేవలతో పాటు సంస్థకు నెలవారీ కాంట్రిబ్యూషన్ చెల్లించడాన్ని మరింత సులభతరం చేస్తుంది.
EPFO 2.01 – కొత్త టెక్నాలజీతో వేగవంతమైన సేవలు
EPFO 2.01 అనే నూతన IT సిస్టమ్ ద్వారా దావాల (claims) పరిష్కార వేగం గణనీయంగా పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6 కోట్లకు పైగా క్లెయిమ్‌లు సెటిల్ చేయడం ద్వారా గత ఏడాదితో (2023-24) పోల్చితే 35% వృద్ధి సాధించింది.
EPFO 3.0 రాబోతుంది – బ్యాంకుల సేవల లాగా వేగంగా & సులభంగా EPFO సేవలు అందించడానికి EPFO 3.0 రాబోతోంది అని మంత్రివర్యులు మాండవీయ గారు ప్రకటించారు.
Related News
8.25% వడ్డీ రేటు
ఈసారి EPFO ఖాతాదారులకు 8.25% వడ్డీ రేటు ఇవ్వడం జరిగింది. ఇది పెన్షన్ ప్లానింగ్ & భవిష్యత్ సేవింగ్ కోసం చాలా మంచి రేటు అని మంత్రి తెలిపారు.
EPFOతో కొత్తగా జతకానున్న 15 బ్యాంకులు
HSBC Bank, Standard Chartered Bank, Federal Bank, IndusInd Bank, Karur Vysya Bank, RBL Bank, South Indian Bank, City Union Bank, IDFC First Bank, UCO Bank, Karnataka Bank, Development Bank of Singapore, Tamilnad Mercantile Bank, Development Credit Bank & Bandhan Bank
EPFO సభ్యులు ఇప్పుడు మరింత వేగంగా సేవలు పొందొచ్చు
ఈ కొత్త అప్‌డేట్ వల్ల ఉద్యోగులకు, పెన్షన్ దారులకు మరింత సౌకర్యంగా EPFO సేవలు అందుబాటులోకి రానున్నాయి. మీరు కూడా మీ బ్యాంకును EPFOతో లింక్ చేసారా? వెంటనే చెక్ చేసుకోండి.