ఏపీ విద్యార్థులకు శుభవార్త. పాఠశాలలు తెరిచిన రోజే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తారు. పాఠశాలలు తెరిచే రోజునే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు.
ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈసారి SCERT డిజిటల్ ద్విభాషా పాఠ్య పుస్తకాలను విద్యార్థులు కొరకు CSE వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచింది.. ఈ పుస్తకాలు డౌన్‌లోడ్ చేసుకోవడానికి పెద్ద పరిమాణంలో ఉన్నందున, విద్యార్థులకు సులభంగా డౌన్‌లోడ్ చేయడానికి వాటిని కంప్రెస్ చేసి టీచర్ ఇన్ఫో ఈ లింక్ నందు పొందుపరిచారు . చిన్న సైజులో డౌన్‌లోడ్ చేసుకోండి.. లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
ఏపీ విద్యార్థులకు శుభవార్త పాఠశాలల ప్రారంభం రోజునే పాఠ్యపుస్తకాల పంపిణీ
2024-25 విద్యా సంవత్సరం మొదటి సెమిస్టర్‌కు అవసరమైన పుస్తకాలు ఇప్పటికే మండల స్టాక్ పాయింట్‌లకు పంపిణీ చేయబడ్డాయి. జూన్ 12న పాఠశాలలు తెరిచే రోజు నుంచి పుస్తకాలు పంపిణీ చేయనున్నారు.
ప్రైవేట్ పాఠశాలలకు అవసరమైన పాఠ్య పుస్తకాలను రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు. దీంతో ఏపీ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.