కొత్త ఏడాదితగ్గుతాయి అనుకున్న బంగారం, వెండి ధరలు నిరాశ పరిచాయి. మొన్నటి దాకా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న ధరలు నేడు అనూహ్యం గా మళ్ళీ పెరిగాయి.
- ఈ రోజు భారతదేశంలో బంగారం ధరలు 1 గ్రాముకి ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం రూ. 7,150 కాగా, 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.7,800. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.71,500 కాగా, నిన్నటి ధర రూ.71,100 అంటే రూ.4,00 పెరిగింది.
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,000, నిన్నటి ధర రూ.77,560 అంటే రూ.440 పెరిగింది.
- ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.58,500గా ఉంది, నిన్న రూ. 58,180గా ఉంది, అంటే రూ. 320 పెరిగింది.
ఈరోజు వెండి ధరలు
నేడు గ్రాము వెండి ధర రూ.90.50 అలాగే కిలోగ్రాముకి రూ.90,500, అంటే నిన్నటి ధరతో సమానంగా ఉంది. కొత్త సంవత్సర దినోత్సవాన్ని పురస్కరించుకుని అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరల ట్రేడింగ్ నేడు ఉండదు. న్యూ ఇయర్ హాలిడే సందర్భంగా గ్లోబల్ సూచీలు మూసివేయడంతో బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉంటాయని భావిస్తున్నారు.
Related News
మరోవైపు బంగారం ధరలు బాగా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో బంగారం ధర మరింతగా పెరుగుతాయనే అంచనాలు బంగారంపై ఎక్కువ పెట్టుబడి పెట్టేందుకు ప్రజలు భావిస్తున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం, భారతీయ మహిళల వద్ద దాదాపు 24,000 టన్నుల బంగారం ఉంది. అంటే ఇతర దేశంలోని బంగారం నిల్వల కంటే ఎక్కువ. ప్రపంచంలోని బంగారంలో 11% భారతీయ మహిళలదే.