Godavari Pushkaralu: 2027లో గోదావరి పుష్కరాలు.. రాజమండ్రికి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు..

2027లో జరగనున్న పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.271 కోట్లు మంజూరు చేసింది. ఈ స్టేషన్ నుండి సంవత్సరానికి గంటకు 9,533 మంది ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేస్తూ స్టేషన్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధికి ఇప్పటికే రూ.250 కోట్లకు టెండర్లు పిలిచారు. అయితే, పుష్కరాల ప్రతిపాదనలతో వీటిని రద్దు చేసి, కేంద్రం కొత్త నిధులు మంజూరు చేసింది.

అయితే, విజయవాడ రైల్వే డివిజన్‌లో రాజమండ్రి రైల్వే స్టేషన్ అత్యంత ముఖ్యమైనది. ఈ స్టేషన్ నుండి విజయవాడ-విశాఖపట్నం-కాకినాడ-భీమవరం వైపు ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తారు. రాబోయే 40 సంవత్సరాలలో ఈ స్టేషన్ నుండి సుమారు లక్ష మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటారని అంచనా.

ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, రాజమండ్రి రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి లక్షణాలతో అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ గతంలో నిర్ణయించింది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.250 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు.

పుష్కరాల నేపథ్యంలో కేంద్రం కొత్త నిధులను ప్రకటించింది.