
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కోట్లాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మోదీ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం పేరు Employment Linked Incentive Scheme, సింపుల్గా ELI Scheme అని పిలుస్తున్నారు.
ఈ పథకం ద్వారా యువత రోడ్డుమీద తిరుగుతూ ఉద్యోగం వెతుకాల్సిన అవసరం ఉండదు. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం పొందిన వారికి ₹15,000 వరకు నేరుగా నగదు ఇస్తుంది. అంతే కాదు, ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రైవేట్ కంపెనీలకు కూడా ప్రోత్సాహకంగా డబ్బు అందిస్తుంది. ఈ ప్రయోజనం రెండు సంవత్సరాలపాటు అమలులో ఉంటుంది.
2024-25 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని ప్రకటించారు. 2025 జూలై 1న ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ ఈ పథకానికి ₹99,446 కోట్ల బడ్జెట్ మంజూరు చేసింది. ప్రధాన లక్ష్యం ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల పెంపు. అంటే ప్రైవేట్ కంపెనీలు ఎక్కువ మంది యువతని ఉద్యోగంలోకి తీసుకుంటే, ప్రభుత్వం ఆ కంపెనీలకు కూడా నిధులు ఇస్తుంది.
[news_related_post]ఇది దేశ ఆర్థిక వ్యవస్థను గట్టిపరచడంలో కీలక అడుగు. ముఖ్యంగా యువతకు మొదటి ఉద్యోగాన్ని పొందడంలో ఇది భారీ మద్దతు ఇవ్వబోతుంది.
ఈ స్కీమ్ రెండు భాగాల్లో పనిచేస్తుంది – ఒకటి ఉద్యోగార్థులకు, మరొకటి ఉద్యోగాలు కల్పించే సంస్థలకు. ఈ పథకం 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు అమలులో ఉంటుంది. ఈ రెండు సంవత్సరాల్లో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలు సృష్టించబడతాయని కేంద్రం అంచనా వేసింది.
2025-26 సంవత్సరంలో 1.92 కోట్ల మంది యువత ఉద్యోగాలు పొందుతారు. ఆ తర్వాతి ఏడాది ఇంకా 2.60 కోట్ల ఉద్యోగాలు కల్పించబడతాయి. వీటిలో భాగంగా అనేక రంగాల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు వెలిసే అవకాశం ఉంది.
ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగం పొందిన యువతకు ₹15,000 నగదు ప్రోత్సాహకం లభిస్తుంది. ఇది రెండు భాగాలుగా వస్తుంది. ఉద్యోగంలో చేరిన 6 నెలల తర్వాత ₹7,500, మిగిలిన 12 నెలల సేవ పూర్తయిన తర్వాత మరో ₹7,500 నేరుగా బ్యాంక్ ఖాతాలోకి వస్తాయి.
ఈ మొత్తాన్ని జీతానికి అదనంగా ప్రభుత్వం ఇస్తుంది. కానీ ఉద్యోగి EPFO (Employees’ Provident Fund Organisation)లో నమోదు అయి ఉండాలి. EPFO ద్వారా డేటా పొందిన తర్వాత ప్రభుత్వమే డబ్బును పంపుతుంది.
ఈ మొత్తాన్ని అందుకోడానికి నెల జీతం ₹1 లక్ష కంటే తక్కువగా ఉండాలి. ఒకవేళ జీతం ₹1 లక్ష దాటితే, ELI Scheme ద్వారా ₹15,000 పొందే అర్హత ఉండదు. అర్హులైన వారికీ ప్రోత్సాహకం నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
ELI Scheme కింద కంపెనీలు ఉద్యోగాలు సృష్టిస్తే వారికి కూడా లాభాలే. కొత్తగా ఉద్యోగంలోకి తీసుకున్న ప్రతి ఉద్యోగికి, కనీసం 6 నెలలు పని చేసిన ప్రతిసారి, ఆ కంపెనీకి ప్రతి నెలా ₹3,000 సబ్సిడీ వస్తుంది. ఈ లాభం రెండు సంవత్సరాలపాటు లభిస్తుంది.
ప్రత్యేకంగా మానుఫాక్చరింగ్ రంగంలో పనిచేస్తున్న కంపెనీలకు ఇది మూడవ మరియు నాలుగవ సంవత్సరాలపాటు కూడా వర్తించవచ్చు. చిన్న కంపెనీలు (50 మందికన్నా తక్కువ ఉద్యోగులు ఉన్నవి) కనీసం 2 మందిని 6 నెలల పాటు కొనసాగిస్తే ఈ బెనిఫిట్ వస్తుంది. పెద్ద కంపెనీలు (50 మందికి పైగా ఉద్యోగులు) కనీసం 5 మందిని నియమించాలి. కంపెనీలు EPFOలో రిజిస్టర్ అయి ఉండాలి.
ఈ పథకానికి ప్రత్యేకంగా అప్లికేషన్ అవసరం లేదు. మీరు కొత్తగా ఉద్యోగంలో చేరి, EPFOలో నమోదు అయినప్పుడే మీరు స్వయంగా ఈ పథకంలోకి వస్తారు. అటు కంపెనీకి కూడా డేటా ప్రభుత్వం వద్దకు వెళుతుంది. ప్రభుత్వమే తగిన డబ్బును ఉద్యోగి లేదా కంపెనీకి పంపుతుంది.
ఈ కొత్త ELI Scheme ద్వారా యువతకి కొత్త జీవితం మొదలవుతుంది. మొదటి ఉద్యోగంతోనే ₹15,000 నగదు బహుమతి రావడం చిన్న విషయం కాదు. ఇది వారి ఆర్థిక స్థితిని బలపరుస్తుంది. మరోవైపు కంపెనీలకు ఇచ్చే ప్రోత్సాహం వలన ప్రైవేట్ రంగం వేగంగా ఉద్యోగాలు కల్పిస్తుంది. మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే ఇక ఆలస్యం చేయకండి. ఈ స్కీమ్ లాభాలను సంపూర్ణంగా వాడుకోండి. ఇప్పుడు ఉద్యోగం వస్తే, భవిష్యత్తు మరింత వెలుగుతుంది.