రైతన్నల కోసం మరో పెద్ద బహుమతి.. PM Kisan 19వ విడత విడుదల.. మీకు ₹2000 వచ్చాయా??

ఫిబ్రవరి 24, 2025న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతుల కోసం మరో గొప్ప ప్రకటన చేశారు. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) 19వ విడత విడుదల కాగా, 9.8 కోట్ల మంది రైతులకు వారి ఖాతాల్లోకి రూ.2000 చొప్పున జమ అయ్యాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

బిహార్‌లోని భగల్పూర్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మోదీ రూ.22,000 కోట్లను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారి రుజువు చేసింది.

మీరు కూడా PM Kisan సాయం పొందాలంటే?

ఈ పథకానికి అర్హులైన రైతులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Related News

ఆన్‌లైన్ దరఖాస్తు విధానం:

Step 1: PM Kisan అధికారిక వెబ్‌సైట్ (pmkisan.gov.in) ను ఓపెన్ చేయాలి.
Step 2: “New Registration” అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
Step 3: పేరు, మొబైల్ నెంబర్, రాష్ట్రం వంటి వివరాలను నమోదు చేసి OTP వెరిఫై చేయాలి.
Step 4: ఆధార్ నెంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, భూమి వివరాలు నమోదు చేయాలి.
Step 5: ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, భూమి పత్రాలు అప్‌లోడ్ చేసి దరఖాస్తు సమర్పించాలి.

ఆఫ్‌లైన్ దరఖాస్తు విధానం:

  • ఇంటర్నెట్ ఉపయోగించలేని రైతులు సమీప CSC కేంద్రం (Common Service Center) కు వెళ్లి దరఖాస్తు చేయవచ్చు.
  • స్థానిక పట్వారీ లేదా ప్రభుత్వ అధికారుల సహాయం తీసుకోవచ్చు.

ఎవరు అర్హులు?

  • రైతులకు 2 హెక్టార్లలోపు భూమి ఉండాలి.
  • ఆధార్‌కు లింక్ అయిన బ్యాంక్ ఖాతా ఉండాలి.
  • రైతు పేరు భూమి పత్రాలలో నమోదు అయి ఉండాలి.

మీ ఖాతాలోకి డబ్బులు వచ్చాయా? ఇప్పుడే చెక్ చేయండి!

ఈ పథకం రైతుల ఆర్థిక భద్రతకు గొప్ప అవకాశం. ఇప్పటికీ 9.8 కోట్ల మంది రైతులు ఈ ప్రయోజనం పొందుతున్నారు. మీ పేరు లిస్టులో ఉందో లేదో తెలుసుకోవడానికి వెంటనే PM Kisan వెబ్‌సైట్‌ లోకి వెళ్లి చెక్ చేయండి. మీ దగ్గరున్న ఏ చిన్న అవకాశాన్ని కూడా మిస్ చేసుకోవద్దు!

మరిన్ని వివరాలకు: pmkisan.gov.in