ఇప్పుడే కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నవారికి ఇది బంపర్ ఛాన్స్. ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్ జరుగుతోంది. ఈ సేల్‌లో తాజాగా లాంచ్ అయిన Realme P3 సిరీస్‌లోని Realme P3 Pro 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుతోంది. చాలా తక్కువ ధరకే మీరు ఈ ఫోన్‌ను మీకు పొందవచ్చు.
ఇందులో బ్యాంక్ ఆఫర్, ఎక్సేంజ్ ఆఫర్, నో కాస్ట్ ఈఎంఐ వంటివి కూడా ఉన్నాయి. ఇవి అన్ని కలిపితే ఈ ఫోన్ ధర మరింత తగ్గుతుంది. మీరూ డిస్కౌంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ కథనం పూర్తిగా చదవండి.
Realme P3 Pro 5G ధర & ఆఫర్ వివరాలు
Realme P3 Pro 5G 8GB RAM మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతంగా రూ.28,999కి లిస్ట్ అయ్యింది. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో ఇది 17 శాతం తగ్గింపుతో కేవలం రూ.23,999కి లభిస్తోంది. అయితే, ఇక్కడితో ఆగిపోకండి. మీరు బ్యాంక్ కార్డ్‌లు ఉపయోగించి అదనంగా రూ.2000 తగ్గింపు పొందవచ్చు.
Related News
ఇంకా, Flipkart Axis బ్యాంక్ కార్డ్ వాడితే 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా వస్తుంది. అదే సమయంలో ఎక్సేంజ్ ఆఫర్ కూడా ఉంది. పాత ఫోన్‌ను మార్చి ఇవ్వడంవల్ల రూ.22,450 వరకు తగ్గింపును పొందవచ్చు. అయితే ఈ విలువ పూర్తిగా పొందాలంటే మీ పాత ఫోన్ మంచి పనిలో ఉండాలి.
మరోవైపు, మీరు నో కాస్ట్ ఈఎంఐతో కూడా కొనుగోలు చేయవచ్చు. నెలకు రూ.4000 చొప్పున ఈ ఫోన్‌ను మీకోసం తెచ్చుకోవచ్చు. ఇలా మీరు మీ బడ్జెట్‌ను మించకుండా కొత్త ఫోన్‌ను సులభంగా కొనగలుగుతారు.
Realme P3 Pro 5G స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్లు
Realme P3 Pro 5G ఫోన్ డిస్‌ప్లే చాలా ప్రత్యేకంగా ఉంది. ఇది 6.7 అంగుళాల క్వాడ్ కర్వ్ AMOLED ప్యానెల్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz, అంటే స్క్రోల్ చేస్తుంటే స్క్రీన్ స్మూత్‌గా పని చేస్తుంది. ఫోన్ చూడటానికి స్టైలిష్‌గా ఉంటుంది.
ఫోన్‌లో పవర్‌ఫుల్ Snapdragon 7s Gen 3 5G చిప్‌సెట్ వాడారు. దీని వలన మీరు మల్టీటాస్కింగ్, గేమింగ్, వీడియో ఎడిటింగ్ వంటి పనులను ల్యాగ్ లేకుండా చేయగలుగుతారు. ఫోన్ వేడెక్కకుండా స్మూత్‌గా పనిచేస్తుంది.
కెమెరా విషయానికి వస్తే, ఫోన్‌లో 50MP ప్రధాన కెమెరా ఉంది. దీని ద్వారా క్లీన్, షార్ప్ ఫొటోలు తీసుకోవచ్చు. అలాగే 2MP సెకండరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. వీడియో కాల్స్, Instagram రీల్స్, సెల్ఫీలు తీసుకోవడానికీ ఇది బెస్ట్‌గా ఉంటుంది.
బ్యాటరీ పరంగా చూస్తే, ఈ ఫోన్‌లో 6000mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు రోజులు ఇబ్బంది లేకుండా నడుస్తుంది. అలాగే 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. తక్కువ టైమ్‌లో ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు.
ఇంకా ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఫోన్‌కు IP69 సర్టిఫికేషన్ ఉంది. అంటే నీటిలోనూ పనిచేస్తుంది. చిన్నగా జారి నీటిలో పడిపోయినా ఏమి అవదు. రఫ్ యూజ్‌కి కూడా ఈ ఫోన్ సేఫ్‌గా ఉంటుంది.
ఫోన్‌లో 5G కనెక్టివిటీతో పాటు Wi-Fi, Bluetooth, GPS వంటి అన్ని అవసరమైన కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. ఇక ఓఎస్ అప్‌డేట్ల విషయానికొస్తే, Realme ఈ ఫోన్‌కు 2 సంవత్సరాల Android అప్‌డేట్లు మరియు 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తోంది.
ఈ డిస్కౌంట్ మిస్ అయితే మాత్రం పెద్ద లాస్
ఇప్పుడు ఉన్న ఆఫర్లతో Realme P3 Pro 5G ఫోన్‌ను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్, ఎక్సేంజ్ ఆఫర్, నో కాస్ట్ ఈఎంఐలు వంటివి కలిపితే ఇది బడ్జెట్ ఫోన్‌లలో బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ ముగిసేలోపు మీరు ఈ ఫోన్‌ను ఆర్డర్ చేస్తే మంచి డీలే అందుకుంటారు.
అందుకే ఆలస్యం చేయకుండా ఈ బంపర్ డిస్కౌంట్‌ను ఉపయోగించుకోండి. Realme P3 Pro 5G ఫోన్ కొనాలనుకుంటే ఇదే బెస్ట్ టైం. ఇక ఇదే ఆఫర్ మళ్లీ రాదేమో..