Portable Mini Coolers: రు.5000కే వేసవి చల్లగా మార్చే కూలర్లు వచ్చేశాయ్… పర్ఫెక్ట్ ఏదో మీరే ఎంచుకోండి…

ఈ వేసవి అగ్ని గోళంలా తగులుతోంది. ఇంట్లో కూర్చున్నా చెమటలు పట్టేస్తున్నాయి. అప్పుడు మనం తక్షణమే గుర్తు తెచ్చుకునేది ఏసీ. కానీ ప్రతీసారి ఏసీ కొనే సత్తా అందరికీ ఉండదు. ముఖ్యంగా హాస్టల్‌లో ఉన్నవాళ్లకు, అద్దె ఇంట్లో ఉండేవాళ్లకు ఇది చాలా పెద్ద సమస్య. వీళ్ల కోసం ఇప్పుడు ఒక మినీ కాని మేజిక్ లాంటీ పరిష్కారం వచ్చేసింది. అదే పోర్టబుల్ మినీ ఎయిర్ కూలర్లు…

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ మినీ కూలర్లు చిన్నవి, తక్కువ ఖర్చుతో వస్తాయి, కానీ చల్లదనంలో ఏమాత్రం తగ్గవు. మీరు డెస్క్ మీద పెట్టుకోవచ్చు, పడుకునే సమయంలో బెడ్ పక్కన పెట్టుకోవచ్చు, అవసరమైనప్పుడు రూమ్‌లో ఒక మూలకు తీసుకెళ్లి వాడుకోవచ్చు. ఇవి కేవలం ₹1000 నుంచి ₹5000 మధ్యే లభిస్తున్నాయి. ఇప్పుడు వాటిలో టాప్ 5 మినీ కూలర్ల గురించి తెలుసుకుందాం.

Candes Mini Air Cooler – బడ్జెట్‌తో బ్రహ్మాండమైన చల్లదనం

ఈ మినీ కూలర్‌కి 12 లీటర్ల నీటి సామర్థ్యం ఉంది. దాంతో పాటు ఇందులో హై స్పీడ్ బ్లోవర్‌తో పాటు 3-వే స్పీడ్ కంట్రోల్ కూడా ఉంది. మరింత చల్లదనం కోసం ఐస్ చాంబర్ కూడా కలదు. ఇంట్లో పవర్ కట్ అయినా మీరు బాధపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది ఇన్వర్టర్‌తో పనిచేస్తుంది. కూలింగ్ ఫ్యాబ్రిక్ హనీకాంబ్ ప్యాడ్‌తో తయారు చేయబడింది, అందువల్ల చాలా సమర్థవంతంగా చల్లదనం ఇస్తుంది. అమెజాన్‌లో ఇది ₹3999కే లభిస్తుంది, అంతేకాదు ఒక సంవత్సరం వారంటీతో వస్తుంది కూడా.

Related News

TEKCOOL Mini Cooler – చిన్నదైనా చల్లదనం భయంకరం

ఇది మార్కెట్లో ప్రస్తుతం బాగా అమ్ముడవుతున్న మినీ కూలర్. దీని సైజు చాలా చిన్నది, కానీ ఇది ఇచ్చే చల్లదనం మాత్రం పెద్ద కూలర్లకు పోటీ పడుతుంది. ఇందులో 7 కలర్ ఎల్ఈడీ లైట్స్ ఉంటాయి, వీటి వలె రాత్రివేళల్లో అద్భుతంగా కనిపిస్తుంది. మూడు వేగాల గాలి రేట్లు, మూడు స్ప్రే మోడ్‌లు ఈ కూలర్‌కి ప్రత్యేకత. దీనిలో ఉన్న అడ్జస్ట్ చేసుకునే ఫంక్షన్ల వల్ల మీరు మీకు కావాల్సిన విధంగా కూలర్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. ధర కూడా కేవలం ₹749 మాత్రమే. ఇది ఏ హాస్టల్‌కి అయినా బెస్ట్ ఆప్షన్!

Forcado Mini Cooler – చల్లదనం ఎక్కడైనా మీ వెంట

ఇది కూడా ఒక పోర్టబుల్ మినీ కూలర్, అయితే ప్రత్యేకతల విషయంలో ఇది మరింత అద్భుతం. ఇందులో కూడా 7 కలర్ ఎల్ఈడీ లైట్స్ ఉంటాయి. మిగిలిన మోడళ్ల మాదిరిగా ఇందులో కూడా 3 విండ్స్ స్పీడ్‌లు, 3 స్ప్రే మోడ్‌లు, టైమర్ ఫంక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది హాస్టల్‌, ఆఫీస్‌, లేదా ఇంట్లో బెడ్ పక్కన పెట్టుకునేందుకు అనువుగా ఉంటుంది. అమెజాన్‌లో ఇప్పుడు 53% డిస్కౌంట్‌తో కేవలం ₹698కే లభిస్తుంది. ఇంత తక్కువ ధరలో ఈ రేంజ్‌కి బెస్ట్ కూలర్ ఇది అన్న మాట.

HIFRESH Personal Room Cooler – స్టైల్‌తో పాటు చల్లదనం

ఇది మార్కెట్లో ప్రీమియం మినీ కూలర్లలో ఒకటి. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది 90 డిగ్రీలు తిరుగుతూ గాలిని అన్ని కోణాల్లో ఇస్తుంది. ఇందులో 3 లెవెల్ మిస్ట్ ఫంక్షన్, 300 మిలీ లీటర్ ఐస్ చాంబర్ ఉంది. అంటే మసాలా వంటలలో పడే వేడిని తట్టుకోలేని వంటింటి మహిళలకూ ఇది ఒక వరం. కిచెన్, హాలూ, బెడ్‌రూమ్‌, ఆఫీసు ఎక్కడైనా పెట్టుకుని వాడుకోవచ్చు. ఇప్పుడు అమెజాన్‌లో ఇది 38% తగ్గింపుతో లభిస్తోంది. అసలు ధర ₹6390 అయినా ఇప్పుడు మీరు ₹3990కే దాన్ని కొనుగోలు చేయవచ్చు.

Koovix Portable Air Cooler – తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లు

ఈ చిన్న పాప మినీ కూలర్ అయినా, పనిచేసే శైలి పెద్దదాని మాదిరిగా ఉంటుంది. ఇది 3-ఇన్-1 మల్టీ ఫంక్షన్‌తో వస్తుంది. అంటే ఇందులో మూడు స్ప్రే మోడ్‌లు, మూడు విండ్ స్పీడ్‌లు ఉన్నాయి. మీరే అడ్జస్ట్ చేసుకునేలా అన్ని కంట్రోల్ ఫీచర్లు ఉన్నాయి. అందులోపాటు, ఇది యూఎస్‌బీ కనెక్టివిటీతో వస్తుంది, అంటే పవర్ బ్యాంక్‌తో కూడా నడిపేయవచ్చు. ఇది ట్రావెల్ చేసే సమయంలోనూ, ఆఫీసులోనూ, బెడ్ పక్కననూ పెట్టుకుని చల్లదనం పొందవచ్చు. ధర కూడా కేవలం ₹999లోపే. చూడటానికి వైట్ కలర్‌లో చాలా క్లాస్‌గా ఉంటుంది.

ఇప్పటివరకు మీరు మినీ కూలర్లు అంటే పనిచేయవని అనుకుంటే మర్చిపోండి. ఈ కొత్త జనరేషన్ పోర్టబుల్ మినీ ఎయిర్ కూలర్లు శబ్దం తక్కువగా చేస్తూ, చల్లదనాన్ని పంచుతూ, ధరలో తక్కువగా ఉండి, రూమ్ స్టైల్‌కూ తగ్గట్టు డిజైన్ చేస్తూ వచ్చాయి. AC ఖర్చు లేనిదే, మీ బడ్జెట్ లోపలే, ఈ మినీ కూలర్లతో మీరు వేసవిని గెలవవచ్చు.

ఇప్పుడు మీరు ఏ హాస్టల్‌లో ఉన్నా, అద్దె ఇంట్లో ఉన్నా, చిన్న రూమ్‌లో ఉన్నా, ఒక చిన్న డెస్క్ మీద కూలర్ పెట్టి మీ చల్లని ప్రపంచాన్ని సృష్టించుకోండి. ఇదే సమయం – లేటయితే లాస్…