వైద్య రంగంలో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విప్లవం మొదలైంది. హ్యూమనాయిడ్ రోబోస్ మనిషి లాగే ప్రవర్తిస్తూ ఇప్పుడు ఆసుపత్రుల్లో డాక్టర్ల పనులు చేస్తున్నారు. మనిషి చేసినంత మానవతా భావం చూపిస్తూ, రోగులను పరీక్షించి, చికిత్స చేస్తున్నాయి. ఇది కేవలం ఒక ప్రయోగం కాదు, ఇప్పటికే 95% యాక్యురసీతో రోగుల చికిత్స జరుగుతోంది.
చైనా దేశంలోని ప్రముఖ మెడికల్ యూనివర్శిటీ ఒక కొత్త ప్రయోగం చేసింది. ఫైవ్ ఆర్మీ మెడికల్ యూనివర్శిటీలో తొలిసారి ఓ పూర్తి స్థాయి హ్యూమనాయిడ్ హాస్పిటల్ ప్రారంభమైంది. ఈ హాస్పిటల్‌లో డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు లేకుండా అన్ని పనులు AI ఆధారిత హ్యూమనాయిడ్ రోబోలు చేస్తున్నాయి.
AI డాక్టర్లు అన్ని వైద్య పరీక్షలు, స్కానింగ్‌లు, ఎక్సరేలు పూర్తిగా స్వయంచాలకంగా నిర్వహిస్తున్నాయి. రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సున్నితంగా ట్రీట్‌మెంట్ ఇస్తున్నాయి. అత్యాధునిక సాంకేతికతతో తయారైన ఈ హ్యూమనాయిడ్‌లు మానవ డాక్టర్లను కూడా అధిగమించాయి.
ఈ హాస్పిటల్‌ను సందర్శించిన జెరెంటల్ హాస్పిటల్ విభాగాధిపతులు, “ఇది భవిష్యత్తులో ప్రపంచం తలపడాల్సిన మార్గం. డాక్టర్ల కొరతను తీరుస్తుంది. రోగుల సేవా నాణ్యతను పెంచుతుంది,” అని వ్యాఖ్యానించారు. 14 మంది AI డాక్టర్లను ఉపయోగించి ఇప్పటికే అనేక మంది రోగులకు చికిత్స అందిస్తున్నారు.
ఈ హ్యూమనాయిడ్‌లు కేవలం రోగుల ఆరోగ్యాన్ని పరీక్షించడం మాత్రమే కాదు.. వారితో మాట్లాడడం, భరోసా కలిగించడం, దినచర్యలో మార్పులు సూచించడం కూడా చేస్తుండటం విశేషం. ఇది రోగులకు మానసికంగా ఎంతో ఉపశమనం కలిగిస్తోంది.
ఈ AI టెక్నాలజీ వెనుక GPT 3.5 మోడల్ ఆధారంగా నిర్మించిన భారీ లాంగ్ లాంగ్వేజ్ మోడల్స్ ఉన్నాయి. ఈ మోడల్స్ బేస్‌గా తీసుకుని హ్యూమనాయిడ్‌లు వైద్య విద్యను, అనుభవాన్ని కంప్యూటింగ్‌తో కలిపి వినూత్నంగా సేవలందిస్తున్నాయి.
ఇందులో మరొక ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, ఈ AI డాక్టర్లు ఇచ్చే ట్రీట్‌మెంట్ మానవ డాక్టర్ల కంటే 93 శాతం యాక్యురసీతో ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. మానవ డాక్టర్లు ఎప్పుడైతే 80-82 శాతం సరైన డయాగ్నసిస్ ఇస్తారో, ఈ హ్యూమనాయిడ్‌లు 95 శాతం వరకు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి.
ఇది చూసిన పరిశోధకులు, వైద్య రంగ నిపుణులు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇది కేవలం చైనా వరకే కాదు, త్వరలోనే ఇతర దేశాల్లోనూ ఇదే మాదిరిగా రోబో హాస్పిటల్స్ ఏర్పడే అవకాశాలు చాలా ఉన్నాయి.
భవిష్యత్ వైద్య రంగం పూర్తిగా హ్యూమనాయిడ్‌ల మీద ఆధారపడి ఉండబోతుంది. ఇది ఒక్క వైద్యంలోనే కాదు.. డయాబెటిస్, క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లమ్‌లు లాంటి క్లిష్ట రోగాలను ముందే గుర్తించడానికి కూడా AI టెక్నాలజీతో హ్యూమనాయిడ్‌లు సాయపడతాయి.
అందుకే ప్రముఖ వైద్య పరిశోధకుల ప్రకారం “మానవ డాక్టర్ల అవసరం తగ్గబోతుంది. కేవలం అత్యవసర శస్త్రచికిత్సల కోసం మాత్రమే వాళ్ల సేవలు అవసరం అవుతాయి. మిగతా అన్ని వైద్య సేవలను హ్యూమనాయిడ్‌లు చాలా సమర్థంగా చేయగలవు.”
ఈ పరిణామాలు ఒకవైపు ఆశ్చర్యానికి గురిచేస్తున్నా, మరోవైపు మానవ డాక్టర్లకు భవిష్యత్తు పనుల భయం పెంచుతున్నాయి. ఎంతో మంది వైద్య విద్యార్థులు తమ భవిష్యత్తుపై సందేహంగా మారుతున్నారు. మానవుల స్థానాన్ని రోబోలు తీసుకోవడం ఎంతో మంది ఉద్యోగుల భద్రతపై ప్రశ్నలు పెంచుతోంది.
అయినా కూడా ఇది తటస్థంగా చూస్తే ఒక సాంకేతిక విప్లవం. AI ద్వారా ప్రపంచ వైద్య రంగంలో ఖర్చులు తగ్గబోతున్నాయి. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి.
ఇప్పటి వరకు మానవ డాక్టర్లు చికిత్సలో చేసే పొరపాట్లు, ఆలస్యం, మానవ సంబంధాల ప్రభావం వంటివి ఎక్కువగా ఉండేవి. కానీ హ్యూమనాయిడ్‌లు ఇలాంటివి ఏమీ లేకుండా సహజంగా పనిచేయడం వల్ల రోగులకు మంచి ఫలితాలు రావడం గమనార్హం.
చివరగా, ఇది మొదటిపదంగా చైనా హాస్పిటల్‌లో ప్రారంభమైనా, త్వరలోనే మన దేశంలో కూడా ఇలాంటి టెక్నాలజీ వస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది వైద్య రంగాన్ని పూర్తిగా మార్చేసే టెక్నాలజీగా నిలవనుంది.