OnePlus అభిమానులకు శుభవార్త. కొత్త ఫ్లాగ్‌షిప్ లుక్, ప్రీమియం ఫీచర్లతో OnePlus 13s అనే కొత్త మోడల్ త్వరలోనే భారత్‌లో విడుదల కానుందట. ఇది OnePlus 13R, OnePlus 13 లకు మద్య స్థాయిలో నిలవబోతున్న ఫోన్ అని లీకులు చెబుతున్నాయి. అంటే ధర తక్కువగా ఉంటుంది కానీ ఫీచర్లు మాత్రం ఫ్లాగ్‌షిప్ లెవల్లో ఉంటాయన్న మాట.
ఈ ఫోన్ ఇప్పటికే చైనా మార్కెట్‌లో OnePlus 13T పేరుతో కనిపించిందని సమాచారం. ఇప్పుడు అదే ఫోన్ భారత్‌కు OnePlus 13s పేరుతో వస్తుందట. మే లేదా జూన్ 2025లో ఇది లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఫోన్ గురించి ఇప్పటి వరకూ వచ్చిన లీకులు చూస్తే, ఇది మంచి హైప్ క్రియేట్ చేస్తోంది.
ధర విషయానికి వస్తే, ఈ ఫోన్ దాదాపు రూ.50,000 ఉండబోతుందని అంటున్నారు. OnePlus 13R ధర రూ.42,999 ఉండగా, OnePlus 13 ధర రూ.69,999గా ఉంది. కాబట్టి OnePlus 13s ఫోన్ ఈ రెండు మోడల్స్ మధ్యలో ఉండబోతుంది. ఇది ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు కావాలని అనుకునే వారికి, కానీ ఎక్కువ ఖర్చు చేయలేనివారికి సరైన ఆప్షన్ అవుతుంది.
Related News
డిజైన్‌లో కొత్త టచ్ – అలర్ట్ స్లైడర్‌కి బదులుగా షార్ట్‌కట్ కీ
OnePlus 13s డిజైన్ చాలా స్లిమ్‌గా ఉండబోతోందట. 6.32 అంగుళాల AMOLED ఫ్లాట్ డిస్‌ప్లేతో వస్తుందట. స్క్రీన్‌పై మధ్యలో పంచ్‌హోల్ సెల్ఫీ కెమెరా కనిపిస్తుందట. బార్డర్లు చాలా పలుచగా ఉండేలా ప్లాన్ చేశారట. ఇందులో పెద్ద మార్పు ఏమిటంటే – OnePlus కి ప్రత్యేకతగా ఉన్న అలర్ట్ స్లైడర్‌కి బదులుగా ఇప్పుడు కొత్తగా షార్ట్‌కట్ కీ తీసుకొస్తున్నారట.
ఈ కీ ద్వారా యాప్స్ ఓపెన్ చేయడం, సౌండ్ ప్రొఫైల్ మార్చడం వంటి పనులు వెంటనే చేయొచ్చు. ఇది యూజర్‌కు కొత్త అనుభూతినివ్వబోతోందని టెక్ ప్రపంచంలో చర్చ జరుగుతోంది. ఫోన్ బ్యాక్ సైడ్ చూస్తే – సింపుల్, క్లీన్ లుక్‌తో డ్యూయల్ కెమెరాలు ఉంటాయట.
పవర్‌ఫుల్ చిప్‌సెట్ – గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు పర్ఫెక్ట్
OnePlus 13s లో ఉన్న ముఖ్యమైన అప్‌గ్రేడ్ అంటే – కొత్త Snapdragon 8 Elite చిప్‌సెట్. ఇది 3nm టెక్నాలజీపై తయారు చేసిన శక్తివంతమైన ప్రాసెసర్. దీనితో పాటు 16GB LPDDR5X RAM, 1TB వరకూ UFS 4.0 స్టోరేజ్ ఇచ్చే అవకాశం ఉంది.
అంటే ఈ ఫోన్ గేమింగ్, హై ఎండ్ యాప్స్, ఫాస్ట్ మల్టీటాస్కింగ్ చేయాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ రేంజ్ లో ఇలా పవర్‌ఫుల్ స్పెసిఫికేషన్లు రావడం చాలా అరుదు.
డ్యూయల్ కెమెరాలతో ప్రో లెవల్ ఫోటోలు
OnePlus 13s కెమెరా సెటప్ కూడా చాలా ప్రిమియం లుక్‌లో ఉండబోతోందట. ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. దీనికి OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంటుంది. రెండో కెమెరా కూడా 50MP టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఇది 2x ఆప్టికల్ జూమ్ ఇస్తుందట.
ముందు వైపున 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. అయితే ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ కాదు కానీ, ఉన్న రెండు కెమెరాలు మాత్రం నాణ్యమైన ఫోటోలు తీసేలా ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు. OnePlus కెమెరా ట్యూనింగ్ ఎప్పటికీ బావుంటుంది కాబట్టి ఫోటో ప్రామిసింగ్‌గా ఉండబోతుంది.
బాటరీలో సరికొత్త టెక్నాలజీ – 6260mAh పవర్
బాటరీ విషయంలో ఈ ఫోన్ పెద్ద సర్‌ప్రైజ్ ఇవ్వబోతోందట. ఇందులో 6,260mAh సిలికాన్-కార్బన్ బాటరీ వస్తుందట. ఇది సాధారణ లిథియం-అయాన్ బాటరీలతో పోలిస్తే ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ ఇస్తుందట. అంటే బ్యాటరీ ఎక్కువ టైమ్ నడుస్తుందన్న మాట.
అదే విధంగా 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుందట. అయితే స్లిమ్ డిజైన్ కోసం వెయ్యర్‌లెస్ ఛార్జింగ్ ఉండకపోవచ్చు. అయినా, వేగంగా ఛార్జ్ అయ్యే ఫోన్ కావడం అంటే డైలీ వాడకానికి బాగుంటుంది.
లేటెస్ట్ సాఫ్ట్‌వేర్, భరోసా ఇచ్చే అప్‌డేట్స్
OnePlus 13s OxygenOS 15తో వస్తుందట. ఇది Android 15పై ఆధారంగా ఉంటుంది. OnePlus కంపెనీ ఈ ఫోన్‌కు నాలుగు సంవత్సరాల Android మేజర్ అప్‌డేట్స్, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లు ఇస్తామన్న మాటంటోంది.
అంటే ఇది ఒకసారి కొనుగోలు చేస్తే వచ్చే కొన్నేళ్లు టెన్షన్ లేకుండా వాడచ్చు. ఇంకా ఈ ఫోన్‌కి IP65 రేటింగ్ కూడా ఉండబోతోందట. అంటే నీటి చిందులు, దుమ్ము లాంటివి ఎక్కువ ఇబ్బంది పెట్టవు. స్క్రీన్‌లో ఉన్న ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ కూడా వేగంగా పని చేస్తుందట.
ఫ్లాగ్‌షిప్ చిప్ – మిడ్ రేంజ్ ధర – బిగ్ డీల్ కదా?
ఇన్ని ఫీచర్లను చూస్తే OnePlus 13s నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఫోన్ అవుతుంది. చాలా మందికి ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు కావాలి కానీ రూ.70,000 ఖర్చు చేయలేరు. అలాంటి వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
ఇప్పుడు Samsung, iQOO, Xiaomi లాంటి బ్రాండ్లు కూడా ఈ రేంజ్ లో పోటీకి దిగుతున్నాయి. కానీ OnePlus 13s లాంటి ప్యాకేజీ ఇవ్వగలిగితే, ఇది 2025 ద్వితీయార్థంలో భారీ హిట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఫోన్ లాంచ్ అయిన తర్వాత మరింత క్లారిటీ వస్తుంది. కానీ ఇప్పటివరకూ లీకులు చూస్తే – ఇది ఫోన్ కోసం వేచి ఉండాల్సిందే…
మీరు కొత్త ఫోన్ కొట్టాలనుకుంటున్నారా? అయితే OnePlus 13s వచ్చే దాకా ఓపికపట్టండి. ఈ ఫోన్ మీ డ్రీమ్ ఫోన్ కావచ్చు….