నిమిషాల్లో ₹35 లక్షల వరకు SBI లోన్.. అస్సలు వదులుకోరు… మరి మీరు అర్హులేనా??

రోజువారి ఖర్చులకు మీ ఆర్థిక పరిస్థితులు సరిపోవట్లేదా? లేదా ఆకస్మికంగా ఆర్థిక అవసరం ఏర్పడిందా? ఇలాంటి పరిస్థితుల్లో చేదోడుగా ఉండే ఆర్థిక వనరులను గుర్తించడం, వాటి గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ రోజుల్లో ఆకస్మిక ఆర్థిక అవసరాలు ఎదురైతే బ్యాంక్ రుణాలు తీసుకోవడం చాలా సాధారణంగా మారింది. కానీ, లోన్ తీసుకునే ప్రతిసారి ఎక్కువ డాక్యుమెంటేషన్, హై ఇంట్రెస్ట్ రేట్లు, ఎక్కువ ప్రాసెసింగ్ ఫీజులతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అయితే హై సాలరీ ఉద్యోగులకు మంచి ఆదాయం ఉన్నప్పటికీ, తక్కువ వడ్డీ రేటుతో రుణం అందించేవి చాలా తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొత్తగా తెచ్చిన “SBI Xpress Elite” పర్సనల్ లోన్ స్కీమ్ ఉద్యోగులకు అదిరిపోయే అవకాశాన్ని అందిస్తోంది.

Related News

ఎవరెవరికి ఈ స్కీమ్ వర్తిస్తుంది?

ఈ లోన్ స్కీమ్ ప్రత్యేకంగా నెలకు కనీసం ₹1 లక్ష శాలరీ తీసుకునే హై వాల్యూ శాలరీ ఉద్యోగులకు అందుబాటులో ఉంది. అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, డిఫెన్స్ సిబ్బంది, ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులు, నేషనల్ గుర్తింపు పొందిన విద్యాసంస్థల ఉద్యోగులు ఈ లోన్ కోసం అర్హులు.

ఈ స్కీమ్ ప్రత్యేకతలు ఏమిటి?

  1. ₹35 లక్షల వరకు రుణం – పెళ్లి, ఫ్యామిలీ షాపింగ్, హాలిడే ట్రిప్, అత్యవసర ఖర్చుల కోసం తక్కువ వడ్డీకే పెద్ద మొత్తంలో లోన్.
  2. తక్కువ వడ్డీ రేట్లు – ఇతర ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే 11.45% నుంచి 11.95% వరకు మాత్రమే వడ్డీ ఉండటం ఈ స్కీమ్ ప్రధాన ఆకర్షణ.
  3.  తక్కువ డాక్యుమెంటేషన్ – హై సాలరీ ఉద్యోగుల ఫైనాన్షియల్ స్టేబిలిటీని పరిగణలోకి తీసుకుని, తక్కువ డాక్యుమెంట్లతోనే లోన్ మంజూరు.
  4.  సెక్యూరిటీ లేకుండా – లోన్ కోసం ఎలాంటి గ్యారెంటీ లేదా సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు.
  5.  తక్కువ ప్రాసెసింగ్ ఫీజు – లాంగ్ టర్మ్ లోన్ అయినా ప్రాసెసింగ్ ఫీజు తక్కువగా ఉండటంతో అదనపు ఖర్చులు తగ్గుతాయి.
  6.  డైలీ రెడ్యూసింగ్ ఇంట్రెస్ట్ – మీ లోన్ బాకీ ఉన్న మొత్తంపై మాత్రమే వడ్డీ పడుతుంది, దీని వల్ల మొత్తంగా చెల్లించాల్సిన వడ్డీ తగ్గిపోతుంది.

ఎలాంటి రూల్స్ ఉన్నాయ్?

  • కనీసం ₹3 లక్షలు రుణంగా తీసుకోవాలి, గరిష్ఠంగా ₹35 లక్షలు వరకు పొందవచ్చు.
  •  మీ నెల శాలరీలో 65% లోపు ఈఎంఐ (EMI) ఉండాలి.
  •  ప్రాసెసింగ్ ఫీజు – లోన్ మొత్తం మీద 1.50% ఫీజు, కనీసం ₹1,000 – ₹15,000 వరకు ఉంటుంది (ప్లస్ జీఎస్టీ).
  •  డిఫాల్ట్ జరగితే పెనాల్టీ – 60 రోజుల వరకు చెల్లించకపోతే 2.40%, 60 రోజుల తర్వాత 5% పెనాల్టీ ఉంటుంది.
  •  ప్రీ పేమెంట్ ఛార్జీలు – ముందుగా లోన్ క్లియర్ చేయాలనుకుంటే 3% ఫీజు ఉంటుంది. అయితే డిఫెన్స్ ఉద్యోగులకు పూర్తిగా మినహాయింపు ఇస్తారు.

ఉద్యోగులకు ఎంత వరకు ఉపయోగకరం?

ఈ రోజుల్లో ఉద్యోగస్తులకు పెళ్లిళ్లు, హెల్త్ ఎమర్జెన్సీ, ఫ్లాట్/విల్లా అడ్వాన్స్, పిల్లల చదువుల ఖర్చులు, కార్ కొనుగోలు ఇలా అనేక ఆర్థిక అవసరాలు ఉంటాయి. ఈ సమయంలో తక్కువ వడ్డీకి, తక్కువ డాక్యుమెంటేషన్‌తో భారీ మొత్తంలో రుణం పొందే అవకాశం చాలా రెయర్. అలాగే ఇతర ప్రైవేట్ బ్యాంకులతో పోల్చుకుంటే SBI లోన్ స్కీమ్ మరింత ఆదాయసాదకంగా ఉంటుంది.

ఫైనల్ గానే చెప్పాలంటే…

  •  హై సాలరీ ఉద్యోగులకు ఇది బెస్ట్ పర్సనల్ లోన్ ఆప్షన్ 
  •  తక్కువ వడ్డీ, తక్కువ ఫీజుతో ₹35 లక్షల వరకు రుణం
  •  ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేకుండా సులభంగా లభించే లోన్

కాబట్టి, ఈ బంపర్ ఆఫర్ మిస్ అవ్వకండి. మీ ఫైనాన్షియల్ అవసరాలను సులభంగా తీర్చుకునేందుకు SBI Xpress Elite లోన్ గురించి మరింత సమాచారం తెలుసుకోండి, మీకు అవసరమైతే వెంటనే అప్లై చేయండి.