ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరికీ నెలకు ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ అవసరం. ఉద్యోగం లేకున్నా, ఉద్యోగం ఉన్నా సెటిల్‌మెంట్ కోసం మరో ఆదాయం ఉండాలన్నా, ఈ పోస్ట్ ఆఫీస్ MONTHLY INCOME SCHEME మీకో సూపర్ ఆప్షన్. ముఖ్యంగా రిటైర్డ్ వ్యక్తులు, హౌస్ వైవ్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రజలకు ఇది ఒక గొప్ప ఆదాయ మార్గం.
పోస్ట్ ఆఫీస్ MONTHLY INCOME SCHEME అంటే ఏంటి?
ఇది ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నిర్వహించే చిన్న పొదుపు పథకం. ఇందులో మీరు ఒకసారి ఒక ఫిక్స్‌డ్ మొత్తాన్ని డిపాజిట్ చేస్తారు. ఆపై ప్రతీ నెలా ఆ మొత్తంపై వడ్డీ రూపంలో ఆదాయం వస్తుంది. ఇది ప్రభుత్వ పక్కా హామీతో వచ్చే స్కీమ్ కనుక ఎలాంటి రిస్క్ ఉండదు.
ఇన్వెస్ట్‌మెంట్ ఎంత? లాభం ఎంత?
ఇప్పుడు ఈ స్కీమ్‌పై సంవత్సరానికి 7.7% వడ్డీ లభిస్తుంది. అంటే మీరు ₹9 లక్షలు పెట్టుబడి పెడితే, ప్రతీ నెలా ₹5,775 వడ్డీ వచ్చేస్తుంది. జాయింట్ అకౌంట్ తీసుకుంటే ₹15 లక్షలు వరకు పెట్టుబడి పెట్టొచ్చు. అప్పుడు నెలకు దాదాపు ₹9,625 వడ్డీ వచ్చి పడుతుంది. ఇది టెన్షన్ లేకుండా నెల నెలకు వచ్చే ఆదాయంగా మారుతుంది.
Related News
ఎవరు ఈ స్కీమ్‌లో జాయిన్ అవ్వచ్చు?
ఈ స్కీమ్‌లో ఎవరైనా ఇండియన్ సిటిజన్ జాయిన్ అవ్వొచ్చు. సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. వయసు పరిమితి ఏమీ లేదు. రిటైర్డ్ పర్సన్ అయినా, గృహిణి అయినా, ఉద్యోగం చేసే వారు అయినా ఈ స్కీమ్‌ను ఎంచుకోవచ్చు.
పన్ను మినహాయింపు ఉందా? అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి?
ఈ స్కీమ్‌లో వడ్డీపై TDS కట్ అవదు కానీ మీ ఆదాయానికి అది కలిసిపోతుంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కింద డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ (రేషన్ కార్డు, కరెంట్ బిల్ వంటివి), రెండు పాస్‌పోర్ట్ ఫోటోలు అవసరం.
ఇప్పుడు మిస్ అయితే లైఫ్ టైం ఆదాయం మిస్ అవుతుంది. ఇలాంటి గ్యారంటీతో, రిస్క్ లేకుండా నెలకు ఆదాయం వచ్చే స్కీమ్‌లు చాలా అరుదు. అందుకే ఇప్పుడే మీ దగ్గర ఉన్న డబ్బుతో పోస్ట్ ఆఫీస్ MONTHLY INCOME SCHEMEలో జాయిన్ అవండి. మీ ఖాతాలో ప్రతి నెలా నిశ్చితంగా వడ్డీ వస్తుంది.