
టాబ్లెట్ మార్కెట్లో మరో సంచలనం సృష్టిస్తూ Xiaomi కంపెనీ తన కొత్త ఫ్లాగ్షిప్ మోడల్ Xiaomi Pad 7S Proను విడుదల చేసింది. ఇది కేవలం డిజైన్ వల్ల కాదు, ఇందులో ఉన్న స్పెషల్ చిప్, భారీ బ్యాటరీ, టాప్ క్లాస్ డిస్ప్లే, వేగవంతమైన ఛార్జింగ్ లాంటి ఫీచర్లు వల్ల ప్రత్యేకంగా నిలిచింది. పైగా ఈ ఫ్లాగ్షిప్ టాబ్లెట్ ధర కేవలం ₹42,000 నుంచి ప్రారంభమవుతుండడం విశేషం.
ఈ టాబ్లెట్‌లో ఉన్న ప్రధాన ఆకర్షణ XRing O1 అనే Xiaomi అభివృద్ధి చేసిన ప్రాసెసర్. ఇది 3nm టెక్నాలజీతో తయారవుతుంది. ఇది చాలా పవర్‌ఫుల్‌గా ఉండేలా డిజైన్ చేయబడింది. కానీ, అత్యధిక పవర్ కంటే బ్యాటరీ సేవ్ అయ్యేలా చేయడమే ప్రధాన లక్ష్యం.
Geekbench టెస్ట్‌ల ప్రకారం, ఈ ప్రాసెసర్ Samsung Galaxy Tab S10 Ultraలో ఉన్న Dimensity 9300+ ప్రాసెసర్‌ను కూడా తలదన్నింది. అంటే పనితీరు పరంగా ఇది టాప్ క్లాస్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. దీని వల్ల గేమింగ్, వీడియో ఎడిటింగ్, మల్టీటాస్కింగ్ లాంటివి సులువుగా చేస్తూ, బటరీసేవ్ చేస్తుంది.
[news_related_post]ఈ టాబ్లెట్‌లో 10,610mAh బ్యాటరీ ఉంది. అంటే ఒకసారి ఛార్జ్ చేస్తే ఒక రోజు పూర్తిగా వాడొచ్చు. పైగా 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కేవలం కొద్ది నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఇది విద్యార్థులకు, ఉద్యోగస్తులకు ఎంతో ఉపయోగపడుతుంది.
Xiaomi Pad 7S Proలో 12.5 ఇంచుల పెద్ద LCD డిస్ప్లే ఉంది. దీని రిజల్యూషన్ 3.2K, అంటే చాలా షార్ప్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ ఉన్నందున స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. గేమర్స్‌కు ఇది పెద్ద ప్లస్. ఇంకా HDR10, Dolby Vision వంటి టెక్నాలజీలు ఉన్నాయి. వీటి వల్ల వీడియోలు మరింత డీప్ కలర్స్‌తో, కాంట్రాస్ట్‌తో కనిపిస్తాయి. పైగా 1000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ఈ స్క్రీన్ డైరెక్ట్ సన్‌లైట్‌లో కూడా బాగానే కనిపిస్తుంది.
ఈ టాబ్లెట్‌లో 4 స్పీకర్ల సెటప్ ఉంది. వీటిని Dolby Atmos ట్యూన్ చేసింది. అంటే మీరు హెడ్ఫోన్లు లేకుండా సినిమాలు, వీడియోలు చూస్తున్నా, సౌండ్ రిచ్‌గా, క్లియర్‌గా వినిపిస్తుంది. గేమింగ్‌లో సౌండ్ డైరెక్షన్ అద్భుతంగా ఉంటుంది.
Xiaomi ఈ టాబ్లెట్‌ను ప్రొఫెషనల్ వాడకానికి కూడా పనికొచ్చేలా రూపొందించింది. ఇందులో HyperOS 2 ఉంది, ఇది Android 15 ఆధారంగా రూపొందించబడింది. ఇందులో WiFi 7, USB 3.2 Gen 1, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IR బ్లాస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫైల్ ట్రాన్స్ఫర్, PC కనెక్టివిటీ, WPS Office, ZWCAD లాంటి టూల్స్‌కి సపోర్ట్ ఉంది. అంటే ఇది ల్యాప్‌టాప్‌లా పనిచేస్తుంది.
Xiaomi Pad 7S Pro ధర సుమారు ₹42,000 వద్ద ప్రారంభమవుతుంది. ఈ ధరకు ఈ టాబ్లెట్ చాలా స్పెషల్. గేమర్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఆర్టిస్టులు, వీడియో ఎడిటింగ్ చేసే వారు దీన్ని తప్పక చూడాలి. లాప్టాప్ కొనలేనివారికి ఇది బెస్ట్ అల్టర్నేటివ్ అవుతుంది.
Xiaomi Pad 7S Pro నిజంగా ఒక ఫ్లాగ్షిప్ టాబ్లెట్ అనుభూతిని తక్కువ ధరలో అందించే బెస్ట్ ఆప్షన్. ప్రాసెసర్ నుండి డిస్ప్లే, బ్యాటరీ నుండి సౌండ్ వరకూ ప్రతి అంశంలో ఇది టాప్ క్లాస్. మీరు టాబ్లెట్ కొనాలని చూస్తుంటే, ఈ ప్యాడ్‌ను మిస్ కాకండి.