భారీ గిఫ్ట్.. LPG గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింది – మీ నగరంలో ఎంత తగ్గిందో వెంటనే తెలుసుకోండి…

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తొలిరోజే వినియోగదారులకు పెద్ద బహుమతిగా LPG గ్యాస్ సిలిండర్ ధరను రూ.41 తగ్గించాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. ఇది ముఖ్యంగా వాణిజ్య (కామర్షియల్) గ్యాస్ సిలిండర్లకు వర్తించనుంది. రెస్టారెంట్లు, హోటళ్లు, ధాబాలు, కాంటీన్లు వంటి వ్యాపారాలకు ఇది భారీ ఊరటగా మారనుంది. అయితే, ఇంట్లో వాడే 14.2 కేజీల LPG గ్యాస్ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు జరగలేదు.

ప్రధాన నగరాల్లో వాణిజ్య గ్యాస్ ధరల మార్పు

నేటి నుంచి ఈ తగ్గింపు అమలులోకి వచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల్లో 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా మారాయి: ఢిల్లీ: రూ. 1762 (ముందు రూ. 1803), కోల్‌కతా: రూ. 1872 (ముందు రూ. 1913), ముంబై: రూ. 1714.50 (ముందు రూ. 1755.50) మరియు చెన్నై: రూ. 1924 (ముందు రూ. 1965)

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

వాణిజ్య సిలిండర్ ధర తగ్గింపు వెనుక కారణం ఏంటి?

ప్రతీ నెలా LPG గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు సమీక్షిస్తాయి. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు, మారకపు విలువలు (Dollar vs Rupee), ప్రభుత్వ విధానాలు లాంటి అనేక అంశాలపై ఆధారపడి ధరలు మారుతూ ఉంటాయి. గతంలో మార్చి 1న వాణిజ్య గ్యాస్ ధరను రూ.6 పెంచిన కంపెనీలు, ఇప్పుడు మాత్రం తగ్గించాయి.

గృహ వినియోగ గ్యాస్ ధర యథాతథం

ఇంట్లో వాడే 14.2 కేజీల గ్యాస్ ధరలో ఎటువంటి మార్పు లేదు. ప్రస్తుతం భారతదేశంలోని ప్రధాన నగరాల్లో గృహ వినియోగ గ్యాస్ ధరలు ఇలా ఉన్నాయి: ఢిల్లీ: రూ. 803, కోల్‌కతా: రూ. 829, ముంబై: రూ. 802.50 మరియు చెన్నై: రూ. 818.50.

Related News

ప్రతి నెల గ్యాస్ ధరలు ఎలా నిర్ణయించబడతాయి?

ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ కంపెనీలు LPG గ్యాస్ ధరలను అప్‌డేట్ చేస్తాయి. డిమాండ్ పెరిగితే ధరలు పెరుగుతాయి, సరఫరా పెరిగితే ధరలు తగ్గుతాయి. కేంద్ర ప్రభుత్వం అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకుంటూ, కొన్నిసార్లు సబ్సిడీ విధించే అవకాశమూ ఉంటుంది.

మీ నగరంలో ధర ఎంత?

ఈ తగ్గింపు వల్ల వ్యాపారస్తులకు కొంత ఊరట లభించినా, ఇంకా గృహ వినియోగదారులకు పెట్రోలియం ఉత్పత్తులపై ప్రత్యేక సబ్సిడీ కల్పించాలనే డిమాండ్ ఉంది. మీ ఊర్లో గ్యాస్ ధర ఎంత ఉంది? వెంటనే చెక్ చేసుకుని, కామెంట్ చేయండి.