మహిళలకు Good News: ఉచితంగా కుట్టుమిషన్‌లు, ఇంకా 15 వేలు నగదు కూడా..

కేంద్రంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇప్పటికే అమలవుతున్న పథకాలను కొనసాగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో మహిళలుకు ఉచితంగా కుట్టుమిషన్ ఇచ్చే పథకం కొనసాగుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

వివరాలు తెలుసుకుందాం.

వివిధ రకాల వృత్తులు చేస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఉపకరణాలు, యంత్రాలను అందజేస్తుంది. అయితే కేంద్రం వారికి డబ్బులు ఇవ్వకుండా డబ్బులు ఇచ్చి ఆ డబ్బుతో కొనుగోలు చేసేలా చేస్తోంది. కుట్టు యంత్రం కూడా ఈ రకానికి చెందినదే. కేంద్రం ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన అనే పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా.. కుట్టుమిషన్ కొనుగోలు చేసేందుకు రూ.15,000 పొందవచ్చు. ఈ డబ్బు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది. ఒక వారం డిజిటల్ శిక్షణ కూడా ఇస్తుంది. ఆ సమయంలో రోజుకు రూ.500 చొప్పున డబ్బులు ఇస్తుంది.

కుట్టు మిషన్ కొనుగోలు చేసిన తర్వాత కేంద్రం రూ.లక్ష రుణం ఇస్తుంది. ఈ రుణాన్ని 18 నెలల్లో తిరిగి చెల్లించవచ్చు. రుణాన్ని చెల్లించిన తర్వాత, మీరు మరో 2 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. దీన్ని 30 నెలల్లో చెల్లించాలి. ఇలా కుట్టుమిషన్లు కొనుగోలు చేసే.. దుకాణం పెట్టుకునేందుకు కేంద్రం ఈ రుణం ఇస్తోంది. ఈ రుణాలపై వడ్డీ చాలా తక్కువ. అలాగే.. రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న క్రెడిట్ గ్యారెంటీ ఫీజును కేంద్రం చెల్లిస్తుంది. ఈ పథకానికి మహిళలే కాకుండా పురుషులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకాన్ని ఎలా పొందాలో తెలుసుకుందాం.

ఉచిత కుట్టు యంత్ర పథకానికి అర్హత:

ఉచిత కుట్టు మిషన్ పథకం కోసం దరఖాస్తు చేయడానికి, దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతదేశ పౌరుడిగా ఉండాలి. ఇప్పటికే కుట్టుపని చేస్తున్న వారు మాత్రమే ఉచిత కుట్టు మిషన్ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన కింద టైలర్‌గా పనిచేస్తున్న ఎవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఉచిత కుట్టు మిషన్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి, దరఖాస్తుదారు వయస్సు 18 ఏళ్లు పైబడి ఉండాలి.

ఉచిత కుట్టు యంత్రం పథకం కోసం అవసరమైన పత్రాలు:
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు

  • ఆధార్ కార్డు,
  • అడ్రస్ ప్రూఫ్,
  • గుర్తింపు కార్డు,
  • కుల ధృవీకరణ పత్రం,
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో,
  • మొబైల్ నంబర్,
  • బ్యాంక్ పాస్ బుక్ కలిగి ఉండాలి.

ఉచిత కుట్టు యంత్రం పథకం కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

ముందుగా https://pmvishwakarma.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి. ఇది నమోదు చేయబడాలి. మీరు ఆన్‌లైన్‌లో చేయలేకపోతే, మీరు మీ సమీపంలోని మీ సేవా కేంద్రానికి వెళ్లి పూర్తి చేసుకోవచ్చు. మీరు పైన పేర్కొన్న పత్రాలను మీ వద్ద ఉంచుకోవాలి. మీ దరఖాస్తును సమర్పించిన తర్వాత, మీరు రసీదుని అందుకుంటారు. ఆ రసీదుని మీ దగ్గర ఉంచుకోండి. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే కేంద్రం మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది. కాబట్టి మీరు కుట్టు యంత్రాన్ని కొనుగోలు చేయవచ్చు.