ఏపీలో ఉచిత బస్సు పథకం.. లేటెస్ట్ అప్ డేట్

ఏపీలో అధికారంలోకి వస్తే మహిళలకు RTC buses ల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటన చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Visakhapatnam లో పర్యటించిన ఆయన.. కాస్త ఆలస్యమైనా పథకం అమలు చేస్తామన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకాన్ని విశాఖపట్నం నుంచి ప్రారంభించనున్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ పథకం అమలు విధానాలను అధ్యయనం చేస్తామని మంత్రి మండిపల్లి తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంది. ఈ పథకం ఆధార్ కార్డు ప్రమాణంతో రెండు రాష్ట్రాల్లో అమలు చేయబడుతోంది. తెలంగాణలో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. మీ వద్ద ఆధార్ కార్డు ఉంటే, మీరు రాష్ట్ర సరిహద్దుల వరకు స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు. ఇందులో భాగంగా మహిళలకు జీరో టికెట్‌ను జారీ చేయనున్నారు. Telangana లో deluxe and super luxury buses ల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి లేదు.

Related News

అయితే ఈ పథకంపై తెలంగాణ, కర్ణాటకలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సరిపడా బస్సులు నడపకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏపీలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై ఎలాంటి నిబంధనలు పెట్టనున్నారనేది ఆసక్తికరంగా మారింది.