Food: గాలి, విద్యుత్ తో ఆహారాన్ని సృష్టించిన శాస్త్రవేత్తలు.. ఫిన్ లాండ్ లో అద్భుతం!

Finland కు చెందిన start-up company Solar Foods  ప్రపంచంలో పెరుగుతున్న ఆహార కొరతకు కొత్త పరిష్కారాన్ని కనుగొంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఈ కంపెనీ ‘Solene ’ అనే protein powder ని తయారు చేసింది. ఈ పౌడర్‌ను మనుషులు కూడా వినియోగించవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ ప్రొటీన్‌ పౌడర్‌ని గాలి, విద్యుత్‌ ఉపయోగించి తయారు చేస్తారు.

నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిన్‌లాండ్ శాస్త్రవేత్తల సహకారంతో ఈ కొత్త ఆహారాన్ని కనుగొన్నట్లు సోలార్ ఫుడ్స్ సీఈవో డాక్టర్ పసి వైణిక్క తెలిపారు. ఈ protein powder  hydrogen  (H2) మరియు carbon dioxide పై పెరిగే ఒక రకమైన సూక్ష్మజీవులతో తయారు చేయబడిందని చెప్పబడింది. విద్యుత్ ద్వారా హెచ్ 2, గాలి ద్వారా carbon dioxide  అందించడం ద్వారా ట్యాంకుల్లో ఈ సూక్ష్మజీవి పునరుత్పత్తి చేయబడిందని తెలిపారు.

ఈ సూక్ష్మజీవిని ఎండబెట్టి పౌడర్ గా తయారు చేస్తారని, పసుపు రంగులో ఉండే ఈ protein powder  లో మానవ శరీరానికి అవసరమైన అన్ని విటమిన్లు, అమినో యాసిడ్లు ఉంటాయని చెబుతున్నారు. దాదాపు ఎండు మాంసంలో ఉండే పోషకాలే ఇందులో ఉన్నాయని తెలిపారు.

పర్యావరణ మార్పుల వల్ల ప్రభావితమవుతున్న సంప్రదాయ ఆహారోత్పత్తి పద్ధతులకు ఈ కొత్త ప్రక్రియ ప్రత్యామ్నాయంగా మారుతుందని సంస్థ భావిస్తోంది. ఎడారులు, మంచు ప్రదేశాలతో పాటు ఎలాంటి కఠినమైన వాతావరణ పరిస్థితుల్లోనైనా ఈ పౌడర్‌ను తయారు చేయవచ్చని తెలిపింది. మొక్కల ఆధారిత ఆహార ఉత్పత్తితో పోలిస్తే కేవలం ఒక శాతం నీటితో సోలనోయిడ్ ప్రోటీన్‌ను ఐదు శాతం భూభాగంలో ఉత్పత్తి చేయవచ్చని ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *