సర్వేంద్రియాణాం నయనం ప్రధాన్ అంటారు. కంటి ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజుల్లో చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. చిన్నప్పటి నుండే అద్దాలు ధరించాల్సి వస్తుంది. అయితే, కంటి ఆరోగ్యానికి మంచి ఆహారాలు తింటే, అలాంటి సమస్యలు లేకుండా మీ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని డైటీషియన్లు అంటున్నారు. ఈ క్రమంలో కంటి ఆరోగ్యం కోసం తినవలసిన ఆహారాల ఏమిటో చూద్దాం.
క్యారెట్లు
క్యారెట్లలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది మన కంటి ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది. ప్రతి ఒక్కరూ తమ ఆహార ప్రణాళికలో క్యారెట్లను చేర్చుకోవడం ద్వారా రాత్రి అంధత్వం సమస్య నుండి బయటపడవచ్చు. దృష్టి సమస్యలు కూడా బాగా తగ్గుతాయి
చేపలు
చేపలలో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. చేపలు రెటీనా ఆరోగ్యానికి చాలా సహాయపడతాయి. చేపలను క్రమం తప్పకుండా తినడం వల్ల కంటి సమస్యల నుండి మిమ్మల్ని రక్షించవచ్చు.
పాలకూర
పాలకూర వంటి ఆకుకూరలు కంటి ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలను కలిగి ఉంటాయి. పాలకూరలో లుటీన్, జియాక్సంతిన్ వంటి కెరోటినాయిడ్లు ఉంటాయి. ఇవి మన కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
గుడ్లు
కోడి గుడ్లు జింక్ అద్భుతమైన మూలం. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. జింక్ విటమిన్ ఎ ని కాలేయం నుండి రెటీనాకు రవాణా చేయడంలో సహాయపడుతుంది. అందువల్ల, గుడ్లు కంటి ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.
బ్రోకలీ
బ్రోకలీ విటమిన్ సి, లుటిన్, జియాక్సంతిన్, బీటా-కెరోటిన్ గొప్ప మూలం. ఇవి కంటి ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయి. బ్రోకలీ దృష్టి సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బాదం
బాదంలో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. మీ ఆహారంలో భాగంగా బాదం తీసుకోవడం కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది దృష్టి నష్టాన్ని తగ్గిస్తుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.