ఒక్క వైద్య ఖర్చు లక్షల్లో అవుతోందా? ఈ స్మార్ట్ ట్రిక్స్‌తో సీనియర్ సిటిజన్స్ ఆరోగ్య బీమా ఖర్చు తగ్గించుకోండి..

పెరిగిన వయసులో అనుకోని వైద్య ఖర్చులు పెనుభారంగా మారొచ్చు. హాస్పిటల్ బిల్లులు లక్షల్లో ఉండటంతో రిటైర్మెంట్ సేవింగ్స్ అన్నీ ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. కానీ తక్కువ ఖర్చుతోనే మంచి ఆరోగ్య బీమా పొందే మార్గాలు ఉన్నాయి. సరైన ప్రణాళికతో పెద్దలు తక్కువ ప్రీమియంతో గట్టి కవరేజీ పొందవచ్చు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇన్సూరెన్స్ తీసుకోవడం ఆలస్యం చేయకండి

వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్య బీమా ఖర్చు ఎక్కువ అవుతుంది. 30 ఏళ్ల వయసులో బీమా తీసుకుంటే తక్కువ ప్రీమియంతో వస్తుంది. ఎలాంటి క్లెయిమ్ చేయకుండా ఉంటే ప్రతి ఏడాది 5% నుండి 10% వరకు బోనస్ లభిస్తుంది. ఒకేసారి మూడు సంవత్సరాల పాలసీ తీసుకుంటే 15% వరకు డిస్కౌంట్ లభించే అవకాశముంది.

సరిపడే ప్లాన్ ఎంచుకోవడం ముఖ్యం

ప్రస్తుతం వెబ్‌సైట్స్ ద్వారా అనేక ఆరోగ్య బీమా పాలసీలను పోల్చి చూడొచ్చు. విభిన్న కంపెనీలను విశ్లేషించి అన్ని రకాల ఫీచర్లు చూసి సరైన బీమా ఎంపిక చేసుకోవచ్చు. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్‌కు తగ్గట్టుగా ఉండే పాలసీ ఎంచుకోవాలి.

Related News

సూపర్ టాప్-అప్ ప్లాన్‌తో అదనపు కవరేజీ పొందండి

సాధారణ ఆరోగ్య బీమా తక్కువ మొత్తానికి తీసుకుని, అదనపు టాప్-అప్ పాలసీ తీసుకుంటే హాస్పిటల్ ఖర్చు ఎక్కువైనా తక్కువ ప్రీమియంతో అదనపు భద్రత లభిస్తుంది. ఇలా చేస్తే, మొత్తం ఖర్చు తగ్గిస్తూ, మెరుగైన కవరేజీ పొందొచ్చు.

ఆరోగ్యంగా ఉంటే ప్రీమియం తక్కువ

కొన్ని ఆరోగ్య బీమా కంపెనీలు మెడికల్ చెకప్‌లు, బాడీ మాస్ ఇండెక్స్ (BMI) కంట్రోల్‌లో ఉంచితే ప్రీమియం తగ్గించే ప్రయోజనం ఇస్తున్నాయి. అందువల్ల ఆరోగ్యంగా ఉండటమే మంచి ఆరోగ్య బీమా ఖర్చులను తగ్గించుకునే సాధారణ మార్గం.

సమయం ఉంటే, సరైన ఆరోగ్య బీమా ఎంపిక చేయండి. లేకపోతే లక్షల్లో ఖర్చవుతాయి.