ట్రెండింగ్ బిజినెస్ ఐడియాలు రూ.1 లక్షతో స్టార్ట్ చేయొచ్చు…

జాబ్ చేసుకుంటూ బోర్‌గా ఫీలవుతున్నారా? స్వంత బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? కానీ బ్యాంకు లోన్ తీసుకోవాలంటే భయంగా ఉంది? ఇక టెన్షన్ వద్దు . ఎందుకంటే కేవలం రూ.1 లక్షలలోపు పెట్టుబడితోనే మంచి లాభాలు వచ్చే 5 చిన్న బిజినెస్ ఐడియాలను ఇప్పుడు మీకు చెబుతున్నాం. వీటితో నెలల వ్యవధిలోనే స్థిరమైన ఆదాయం వస్తుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

1. హోం మేడ్ టిఫిన్ సర్వీస్:

ఇప్పుడు ఆఫీసు ఉద్యోగులు, విద్యార్థులు హెల్తీ హోం ఫుడ్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అటువంటి పరిస్థితిలో హోమ్ టిఫిన్ సర్వీస్ బిజినెస్ చాలా మంచి ఆప్షన్. కేవలం ₹30,000 నుండి ₹50,000 వరకు పెట్టుబడితో మొదలుపెట్టొచ్చు. ఈ డబ్బుతో ప్యాకింగ్ బాక్సులు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనాలి. రోజుకు 20-30 కస్టమర్లకు ₹100–₹150 చొప్పున టిఫిన్లు అందిస్తే నెలకు ₹40,000 నుంచి ₹60,000 వరకు సంపాదించవచ్చు.

2. కంటెంట్ రైటింగ్ లేదా బ్లాగింగ్

మీకు రాయడం అంటే ఇష్టం ఉంటే, మీరు బ్లాగ్ లేదా ఫ్రీలాన్స్ రైటర్‌గా స్టార్ట్ చేయొచ్చు. డొమైన్, హోస్టింగ్ కోసం ₹5,000 నుంచి ₹10,000 ఖర్చవుతుంది. మీరు SEO, సోషల్ మీడియా సరిగ్గా వాడితే నెలకు ₹30,000 వరకు సంపాదించవచ్చు. ఇది పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోం బేస్డ్.

Related News

3. ఫోటోగ్రఫీ బిజినెస్

మీకు ఫోటో తీయడం అంటే ఇష్టం ఉంటే ₹50,000 నుంచి ₹1 లక్ష వరకు పెట్టుబడి పెట్టి కెమెరా, లైటింగ్ కొనొచ్చు. మీరు ప్రొఫెషనల్‌గా సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తే, ఒక్క ఫోటోషూట్‌కు ₹5,000–₹15,000 చార్జ్ చేయవచ్చు. నెలకు సగటున ₹40,000–₹50,000 సంపాదించొచ్చు.

4. ట్యూషన్ లేదా ఆన్‌లైన్ కోచింగ్

మీరు ఏదైనా సబ్జెక్టులో నిపుణులైతే, పిల్లలకు హోం ట్యూషన్ లేదా ఆన్‌లైన్ కోచింగ్ మొదలుపెట్టండి. ₹5,000 నుంచి ₹15,000తో మార్కెటింగ్, స్టడీ మెటీరియల్ కోసం పెట్టుబడి ఉంటుంది. Zoom లేదా YouTube ద్వారా క్లాసులు ఇచ్చి నెలకు ₹30,000–₹40,000 వరకు సంపాదించొచ్చు.

5. ప్రింట్-ఆన్-డిమాండ్ బిజినెస్

ఇది తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు వచ్చే బిజినెస్. కస్టమ్ టీ-షర్ట్లు, మగ్స్, మొబైల్ కవర్లు వంటి వాటిని ముద్రించించి అమ్మొచ్చు. ₹10,000–₹20,000 పెట్టుబడితో స్టార్ట్ చేయొచ్చు. ఒక్కో ప్రొడక్ట్‌పై ₹200–₹500 లాభం వస్తుంది. నెలకు ₹40,000 దాకా సంపాదించవచ్చు.

ఈ ఐడియాలు మీరు ఎంచుకున్న దానిపై మరియు మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అవుతాయి. కాస్త పట్టుదల, మంచి డిసిప్లిన్ ఉంటే స్వతంత్ర ఆదాయం సంపాదించగలుగుతారు. చిన్న పెట్టుబడి పెట్టి పెద్ద కలలను నెరవేర్చుకోండి.