ఏపీలోని వేలాది మంది విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాత బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఏపీలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను దశలవారీగా చెల్లించేందుకు సన్నాహాలు చేస్తోంది. వైఎస్సార్‌సీపీ హయాంలో చాలా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. తాము అధికారంలోకి వస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులు, బకాయిలు చెల్లిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తున్నా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు కాలేజీ యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ అంశంపై వైఎస్సార్‌సీపీ పోరాటాన్ని ప్రారంభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వం స్పందించింది. నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రి నారా లోకేష్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం వేలాది మంది ఎదురుచూస్తున్నారని తెలిపారు. నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు ప్రాధాన్యతా క్రమంలో నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
* ఆందోళనలో తల్లిదండ్రులు
ప్రస్తుతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వం నుంచి చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో కాలేజీ యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయి. అయితే తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హామీతో చాలా మంది తమ పిల్లలను ప్రైవేట్ కాలేజీల్లో చేర్పించారు. వీరంతా ఇప్పుడు ఫీజుల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. సంకీర్ణ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. దీనిపై మంత్రి నారా లోకేష్ పలుమార్లు స్పందించారు. త్వరలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. ఇప్పుడు ఇదే విషయాన్ని మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించగా.. సీఎం చంద్రబాబు స్పందించారు. దశలవారీగా నిధుల విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదే సమయంలో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
Related News
* దశల వారీ చెల్లింపులు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని కాలేజీ యాజమాన్యాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ప్రభుత్వం చెల్లిస్తుంది. దశలవారీగా చెల్లించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాల నుంచి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉంచాలని సమావేశంలో నిర్ణయించారు. సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను అధిగమించే పనిలో ఉన్నామన్నారు. మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి మేరకు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చంద్రబాబు తెలిపారు. మొత్తమ్మీద ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ఉద్యమం మొదలైందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెల్లింపులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.