FEB: 124 ఏళ్లలో కెల్లా అత్యంత వేడి నెలగా ఫిబ్రవరి..!!

వేసవి ప్రారంభానికి ముందే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7-8 గంటల నుంచే వేడిగాలులు తమ బలాన్ని చూపిస్తున్నాయి. అయితే, మధ్యాహ్నం సమయంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ (IMD) పేర్కొంది. మార్చి రెండవ లేదా మూడవ వారంలో తెలుగు రాష్ట్రాలపై వేడిగాలులు ప్రభావం చూపుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్, జూన్ మధ్య పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు IMD ఇప్పటికే వేడిగాలుల హెచ్చరికలు జారీ చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

గత 124 సంవత్సరాలలో ఫిబ్రవరి అత్యంత వేడిగాలుల నెలగా నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. గత నెలలో నమోదైన సగటు ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్, 1901 తర్వాత ఫిబ్రవరిలో ఈ స్థాయి సగటు నమోదవడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా.. చరిత్రలో తొలిసారిగా ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్‌ను దాటి కొత్త రికార్డును సృష్టించాయి. ఇది ఫిబ్రవరి 2023లో నమోదైన సగటు గరిష్ట ఉష్ణోగ్రతను కూడా అధిగమించింది.

ఈ పరిస్థితులపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుణుడు అకస్మాత్తుగా కరుణించకపోతే, రాబోయే మూడు నెలలు మండే వేడితో నిండిపోతాయని వారు అంటున్నారు. అలాగే కార్బన్ ఉద్గారాలు, పట్టణీకరణ, అటవీ నిర్మూలన వంటి కారణాల వల్ల వేడి మండిపోతోందని వారు అంటున్నారు.

Related News

పెరుగుతున్న ఎండ తీవ్రతకు అనుగుణంగా ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప మధ్యాహ్నం బయటకు వెళ్లకూడదని వారు సూచిస్తున్నారు. శరీరంలో నీటి శాతాన్ని పెంచే తాజా పండ్లను ఎక్కువగా తినాలని వారు అంటున్నారు. నూనెతో తయారు చేసిన వేయించిన ఆహారాలు, హోటల్ ఆహారం మానుకోవాలని, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, రాగి జావ తాగడం మంచిదని వారు అంటున్నారు.