Jr NTR: ఇది నిజమైన అభిమానం.. ఎన్టీఆర్ పుట్టిన రోజున రక్తదానం చేసిన అభిమానులు.. ఫోటోలు వైరల్

Tollywood film industry young tiger NTR కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. RRR సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న తారక్ సోమవారం (May 20) పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా పలువురు హీరోలు, నటీనటులు, అభిమానులు, నెటిజన్లు young tiger NTR కి birthday శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక NTR birthday అంటే ఆయన అభిమానులకు పండగే. ఎక్కడ చూసినా కటౌట్లు, పోస్టర్లు, కేక్ కటింగ్ కార్యక్రమాలే. ఇదే సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

NTR birthday సందర్భంగా Ra NTR 2.0′ వ్యవస్థాపకులు భారీ ఎత్తున రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఈ బృందం. ఈ బృందంలోని సభ్యులు అవసరమైన వారికి సహాయం చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటారు. ఇందుకోసం సోషల్ మీడియాలో ఓ పేజీని కూడా రూపొందించారు. ఈ నేపథ్యంలో Tarak birthday ను పురస్కరించుకుని పెద్ద blood donation program నిర్వహించారు.