కేంద్ర ఉద్యోగులకు భారీ నష్టం.. ₹2 లక్షల DA పెండింగ్.. ఇప్పుడే పోరాడకపోతే కోల్పోయే ప్రమాదం…

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్. కరోనా కాలంలో జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు పెండింగ్‌లో ఉన్న మూడు DA హాఫ్ ఇన్‌క్రీమెంట్లు ఇప్పటికీ ఇవ్వలేదు. ఉద్యోగ సంఘాలు ఈ డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నా, ప్రభుత్వం మాత్రం తిరస్కరిస్తోంది. అసలు ఎంత నష్టం అవుతోంది? నిజంగా ₹2 లక్షల వరకు కోల్పోతున్నారా? వెంటనే తెలుసుకోండి

DA పెండింగ్ – అసలు విషయంలోకి వస్తే…

  •  కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది జనవరి, జూలైలో DA పెంచాలి.
  •  కానీ 2020లో కరోనా వల్ల 18 నెలల పాటు DA పెంచడం ఆపేశారు.
  • ఈ గ్యాప్‌లో మూడు DA పెరుగుదలలు రావాల్సి ఉండగా, ప్రభుత్వం ఇవ్వలేదు.
  • ఉద్యోగులు తమ హక్కు కోసం పోరాడుతుంటే, ప్రభుత్వం మాత్రం తిరస్కరిస్తోంది

ఉద్యోగ సంఘాలు పోరాటానికి సిద్ధం

  •  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకుంది.
  •  మార్చి 10 & 11 తేదీల్లో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
  •  8వ పే కమిషన్ స్థాపన, పాత పెన్షన్ పథకం (OPS) పునరుద్ధరణకు కూడా డిమాండ్ చేస్తున్నారు.
  •  DA పెండింగ్ చెల్లించాలని ప్రెస్ చేస్తూ కేంద్రం పై ఒత్తిడి పెంచుతున్నారు.

DA పెండింగ్ వల్ల ఉద్యోగులకు ఎంత నష్టం?

  1.  ఏడాదికి సగటు DA పెరుగుదల: 5%
  2.  2020 జనవరి – 2021 జూన్: 18 నెలలు DA పెరుగుదల లేదు
  3.  సగటు ఉద్యోగి కోల్పోయిన మొత్తం: ₹1.5 లక్షలు – ₹2 లక్షల వరకు

అంటే ప్రతి ఉద్యోగి తమ హక్కుగా రావాల్సిన డబ్బును కోల్పోతున్నారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ప్రభుత్వం ఎందుకు తిరస్కరిస్తోంది?

  •  ప్రభుత్వం చెబుతున్నది: “DA పెండింగ్ చెల్లించడం సాధ్యపడదు.”
  •  ఉద్యోగుల ఆగ్రహం: “ఇది మా హక్కు, ఇవ్వకపోతే పోరాటం ముదురుతుంది!”
  •  సమాఖ్య హెచ్చరిక: “ఇదే పరిస్థితి కొనసాగితే దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేస్తాం.”

ఇప్పుడు పోరాడకపోతే కోల్పోయేది ఇదే

  •  ప్రభుత్వం ఇచ్చే వరకు ఎదురుచూడకుండా, సంఘ ఉద్యోగులు  వివిధ పోరాటాలు చేయడానికి సిద్ధం అవుతున్నారు.
  •  ఒకవేళ ఇప్పుడు ఆందోళన కొనసాగించకపోతే, ఉద్యోగుల డబ్బు రావడం కష్టం అని ఉద్యోగుల సంఘా లు అనడం గమనార్హం.