భారతదేశంలో ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు కొనాలనుకునే వారికి శుభవార్త. TVS మోటార్ కంపెనీ కొత్త 3-వీలర్, కింగ్ EV మాక్స్‌ను విడుదల చేసింది. ఇది అనేక ఫీచర్లతో రానున్నది. అంతేకాకుండా.. అద్భుతమైన పరిధి, వేగాన్ని కలిగి ఉంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ వాహనానికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ధర
ధర గురించి మాట్లాడుకుంటే.. TVS King EV Max ఎక్స్-షోరూమ్ ధర రూ. 2,95,000గా కంపెనీ పేర్కొంది. అయితే ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా 6 సంవత్సరాలు లేదా 1,50,000 కి.మీ వారంటీతో అందించబడుతుంది. అంతేకాకుండా.. 3 సంవత్సరాల పాటు 24/7 రోడ్-సైడ్-అసిస్టెన్స్‌తో కూడా వస్తుంది.
Related News
బ్యాటరీ, రేంజ్
TVS King EV Max అధిక పనితీరు గల 51.2V లిథియం-అయాన్ LFP బ్యాటరీతో అమర్చారు. దీని పూర్తిగా ఛార్జ్ చేస్తే 179 కి.మీ.ల పరిధిని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు వెళుతుంది. టీవీఎస్ కింగ్ ఇవి మ్యాక్స్‌ను ఎకో మోడ్‌లో గంటకు 40 కి.మీ వేగంతో, సిటీ మోడ్‌లో గంటకు 50 కి.మీ వేగంతో, పవర్ మోడ్‌లో గంటకు 60 కి.మీ వేగంతో నడపవచ్చు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దీని బ్యాటరీని కేవలం 3 గంటల 25 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.
ఇతర ఫీచర్లు
ఇది LED హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ల్యాంప్‌లు, TVS స్మార్ట్‌కనెక్ట్ ద్వారా టెలిమాటిక్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, అనుకూలీకరించదగిన ఫ్లీట్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్ వంటి సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లతో వస్తుంది. 31% గ్రేడబిలిటీ, 500mm వరకు వాటర్ వేడింగ్ సామర్థ్యం, విశాలమైన క్యాబిన్, ఎర్గోనామిక్ సీటింగ్ డిజైన్ మొదలైనవి ఇందులో ఉన్నాయి.
ఎక్కడ అందుబాటులో ఉన్నాయి
ప్రస్తుతం TVS King EV Max యుపి, బీహార్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, జమ్మూ & కాశ్మీర్ ప్రాంతాల్లో ఎంపిక చేసిన డీలర్ షిప్ లలో అందుబాటులో ఉన్నాయి. ఇక రాబోయే నెలల్లో దేశవ్యాప్తంగా డెలివరీలు ప్రారంభమవుతాయి.