Edge 60 Fusion Vs Narzo 80 Pro: మీ డబ్బుకు బెస్ట్ ఫోన్ ఏది?…

ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అసలైన పోటీ మొదలైంది. 20 నుంచి 25 వేల మధ్యలో ఒక దమ్మున్న ఫోన్ కొనాలంటే Motorola Edge 60 Fusion 5G లేదా Realme Narzo 80 Pro 5G అనే రెండు బ్రాండ్‌లు నేరుగా ఒకరినొకరు ఢీకొడుతున్నాయి. ఇరు ఫోన్‌లలో ఫీచర్లు మంచి స్టాండ్‌ర్డ్‌లో ఉన్నాయి. అయితే, వీటిలో ఏది కొనాలి? ఏదే బెస్ట్ డీల్? ఇప్పుడు ఈ రెండింటిని పూర్తిగా వివరంగా తెలుసుకుందాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ధర విషయంలో ఎవరికి ప్లస్?

ధరే ముందుగా మనం చూస్తాం. Motorola Edge 60 Fusion 5G మోడల్‌కి రెండు వేరియంట్‌లు ఉన్నాయి. 8GB RAM + 256GB స్టోరేజ్ ఉన్న వేరియంట్ ధర రూ.22,999. అదే 12GB RAM + 256GB వేరియంట్‌కి ధర రూ.24,999. ఇదే సమయంలో Realme Narzo 80 Pro 5G మోడల్ 8GB RAM + 128GB స్టోరేజ్‌తో రూ.19,999కే వస్తోంది. 256GB వేరియంట్‌కి రూ.21,499. 12GB RAM వేరియంట్ ధర రూ.23,499. అంటే ఫీచర్లతో పోల్చితే రియల్‌మీ కొంచెం చౌకే.

డిస్‌ప్లే మరియు రెసొల్యూషన్ – ఇక్కడేనా క్లియర్ విజయం?

Motorola Edge 60 Fusion 5Gలో 6.7 అంగుళాల 1.5K కర్వ్‌డ్ pOLED డిస్‌ప్లే ఉంది. దీనికి 1220 x 2712 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ బ్రైట్‌నెస్ లభిస్తుంది. ఇది అత్యుత్తమ డిస్‌ప్లే అనొచ్చు. ఇక Realme Narzo 80 Pro 5Gలో 6.77 అంగుళాల Full HD+ డిస్‌ప్లే ఉంది. దీని బ్రైట్‌నెస్ కేవలం 800 నిట్స్ మాత్రమే. కానీ ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్‌నే కలిగి ఉంది. కాబట్టి డిస్‌ప్లే విషయంలో మోటరోలా స్పష్టంగా ముందుంది.

ప్రాసెసర్ మరియు పనితీరు – ఒకే లెవెల్ కంపిటేషన్

రెండు ఫోన్‌లలోనూ MediaTek Dimensity 7050 ప్రాసెసర్ వాడారు. ఇది 8 కోర్ ప్రాసెసర్. యాప్స్ ఓపెన్ చేయడంలో, గేమింగ్‌లో స్పీడ్ విషయంలో రెండూ సమానంగా ఉంటాయి. పనితీరు పరంగా ఎక్కువ డిఫరెన్స్ ఉండదు.

ఆపరేటింగ్ సిస్టమ్ – కొత్తదే కావాలా?

Motorola Edge 60 Fusion 5Gలో Android 15 ఆధారిత Hello UI ఉంది. ఇది క్లీన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌గా ఉంటుందని మోటరోలా చెబుతోంది. Realme Narzo 80 Pro 5Gలో కూడా Android 15 ఆధారిత Realme UI 6 ఉంది. ఇది ఫీచర్ల పరంగా కస్టమైజేషన్‌తో ఉంటుంది. మీకు క్లీనర్ లుక్ కావాలంటే మోటరోలా బెస్ట్, ఫీచర్లతో చిలిపితనం ఉండాలని అనుకుంటే రియల్‌మీ మంచి ఆప్షన్.

బ్యాటరీ బ్యాకప్ – ఎక్కువ టైమ్ ఉండాలంటే ఏది బెస్ట్?

బ్యాటరీ పరంగా Narzo 80 Pro 5G స్పష్టంగా లీడ్ చేస్తోంది. దీనిలో 6000mAh భారీ బ్యాటరీ ఉంది. 80W ఫాస్ట్ చార్జింగ్, 65W రివర్స్ చార్జింగ్ కూడా ఉంది. ఇక Motorola Edge 60 Fusion 5Gలో 5500mAh బ్యాటరీ ఉంది. 68W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. రెండూ వేగంగా చార్జ్ అవుతాయి. కానీ ఎక్కువ టైం బ్యాకప్ కావాలంటే Narzo బెస్ట్.

కెమెరా సెటప్ – ఫోటో లవర్స్ కోసం వన్ సైడ్ పోటి

Motorola Edge 60 Fusion 5Gలో 50MP Sony LYT700C ప్రైమరీ కెమెరా ఉంది. దీనికి OIS ఉంది. ఇంకో 13MP కెమెరా కూడా ఉంది. ఫ్రంట్ కెమెరా 32MP. రియల్‌మీలో 50MP Sony IMX882 కెమెరా ఉంది. దీనికీ OIS ఉంది. రెండో కెమెరా 2MP మాత్రమే. ఫ్రంట్ కెమెరా 16MP. కెమెరా విషయానికి వస్తే మోటరోలా కెమెరా క్వాలిటీ కొంచెం బెటరే అని చెప్పవచ్చు.

పరిమాణాలు మరియు బరువు – స్లిమ్, స్టైలిష్ ఎవరు?

Motorola Edge 60 Fusion 5G 161mm పొడవు, 73mm వెడల్పు, 8.2mm మందం కలిగి ఉంది. బరువు 180 గ్రాములు. Realme Narzo 80 Pro 5G 162.75mm పొడవు, 74.92mm వెడల్పు, 7.55mm మందంతో 179 గ్రాముల బరువు కలిగి ఉంది. అంటే Narzo కొంచెం స్లిమ్‌గా ఉంటుంది.

కనెక్టివిటీ ఆప్షన్స్ – ఆధునిక టెక్నాలజీ కావాలంటే ఏది?

Motorolaలో NFC సపోర్ట్ ఉంటుంది. 5G, Wi-Fi, Bluetooth, GPS, USB Type-C ఉన్నాయి. Narzoలో కూడా 5G, Wi-Fi 6, Bluetooth 5.4, GPS, USB Type-C ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా రెండూ సమానంగా ఉంటే, మోటరోలా‌లో NFC ఉండటం అదనపు ప్లస్.

ఎఏది కొనాలి?

మీకు ప్రీమియం డిజైన్, కర్వ్‌డ్ డిస్‌ప్లే, మంచి కెమెరా కావాలంటే Motorola Edge 60 Fusion 5G బెస్ట్. ఇక ఎక్కువ బ్యాటరీ, తక్కువ బడ్జెట్, మంచి పనితీరు, స్టైలిష్ లుక్ కావాలంటే Realme Narzo 80 Pro 5G మంచి డీల్.

ఇప్పుడు ఫోన్ కొనాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ టైం. రెండు ఫోన్‌లు కూడా అద్భుతమైన ఫీచర్లతో ఉన్నాయి. మీ అవసరాలను బట్టి సరైన ఫోన్ సెలెక్ట్ చేసుకోండి. ఆలస్యం చేస్తే డిస్కౌంట్‌లు పోతాయ్….

మీరు ఏది ఎంచుకుంటారు?