మీరు రైతైనా లేదా ఉద్యోగం చేస్తూ చిన్నగా వ్యవసాయం చేయాలని చూస్తున్నా, ఇది మీకో మంచి అవకాశం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఇచ్చే తులసి సాగు ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. తులసికి హిందూ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం పూజలకే కాదు, ఆయుర్వేద మందుల తయారీలో కూడా చాలా ముఖ్యమైన ఔషధ మొక్క. కోవిడ్ తర్వాత ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెంచే ఔషధాల డిమాండ్ పెరగడంతో తులసికి మంచి మార్కెట్ ఏర్పడింది.
తులసి మొక్కలు ఎప్పుడు ఎలా నాటాలి?
జూలై నెల తులసి సాగుకు అనుకూలమైన సమయం. సాధారణ తులసి రకాలను 45×45 సెం.మీ దూరంలో నాటాలి. RRLOC 12, RRLOC 14 రకాలైతే 50×50 సెం.మీ స్పేసింగ్ అవసరం. మొక్కలు నాటి వెంటనే నీరు వడలాలి. నాటిన 10 రోజుల తర్వాత మరల నీటి అవసరం ఉంటుంది. పూలు పూయే సమయంలో మొక్కలో ఆయిల్ శాతం తగ్గిపోతుంది కాబట్టి, అప్పటి వరకే కోత పూర్తి చేయాలి.
ఎంత పెట్టుబడి? ఎంత లాభం?
ఈ వ్యాపారం మొదలుపెట్టేందుకు పెద్ద ఖర్చు అవసరం లేదు. కేవలం రూ.15,000 పెట్టుబడితో 1 ఎకరం తులసి సాగు చేయవచ్చు. తులసి పంట 3 నెలల్లో పూర్తిగా సిద్ధమవుతుంది. ఒక ఎకరా తులసి పంట నుంచి రూ.3 నుండి 4 లక్షల వరకు ఆదాయం రావచ్చు. ఈ లాభాలు మార్కెట్ రేటుపై ఆధారపడి ఉంటాయి.
Related News
ఎక్కడ అమ్మాలి? ఎవరికీ అమ్మాలి?
తులసిని స్థానిక మార్కెట్లో నేరుగా అమ్మవచ్చు. కానీ ఎక్కువ లాభం పొందాలంటే ఆయుర్వేద మందుల తయారీ సంస్థలకు అమ్మడం మంచిది. చాలా కంపెనీలు కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా మొక్కలను కొనుగోలు చేస్తాయి. వీటితో ముందే ఒప్పందం చేసుకుని సాగు చేస్తే, మార్కెటింగ్ మీద భయం లేకుండా నమ్మకంగా ఆదాయం పొందవచ్చు.
తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం
ఈ తులసి సాగు ప్రస్తుతం గ్రామాల్లో పెద్దగా పాపులర్ అవుతోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రావడంతో యువత కూడా ఈ వైపు వస్తున్నారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా మీరు రిస్క్ లేకుండా ప్రారంభించవచ్చు. 3 నెలల్లోనే మంచి ఆదాయం రావడంతో ఇది చాలామందికి ఆదాయ మార్గంగా మారుతోంది.
మీరు కూడా ఆలస్యం చేయకుండా ఈ తులసి సాగుతో మీ భవిష్యత్తు మార్చుకోండి.