ఇంగ్లీషులో కొన్ని పదాలలో ఒక్క అక్షరం మారినప్పటికీ వాటి అర్థం మారిపోతుంది. ఉదాహరణకు BAD అని కాకుండా BED అని రాస్తే అర్థం పూర్తిగా మారిపోతుంది. ఈ లేఖ మార్పుతో 13 మంది ఉపాధ్యాయుల జీతాల్లో కోత పడడమే కాదు.
పనితీరు పేరుతో 13 మంది ఉపాధ్యాయుల జీతాల్లో కోత విధిస్తూ విద్యాశాఖ అధికారులు లేఖ రాశారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అధికారుల తీరుపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. వివరాల్లోకి వెళితే..
బీహార్‌లోని జాముయి జిల్లా విద్యా శాఖ యొక్క ప్రతిభావంతమైన పని వెలుగులోకి వచ్చింది. విద్యా శాఖ లేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మరియు దానిపై ప్రజలు రకరకాల చర్చలు జరుపుతున్నారు. విధులకు గైర్హాజరైన ఉపాధ్యాయుల పడక పనితీరు కారణంగా 13 మంది ఉపాధ్యాయుల జీతాల్లో విద్యాశాఖ కోత విధించింది. దీంతో ఉపాధ్యాయ సంఘాల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి.
మే 22న జాముయి జిల్లాలోని పలు పాఠశాలల్లో ఆకస్మిక దాడులు నిర్వహించిన అధికారులు పలువురు ఉపాధ్యాయులు విధులకు గైర్హాజరయ్యారని తెలిపారు. చాలా మంది ఉపాధ్యాయుల పనితీరు కూడా సంతృప్తికరంగా లేదని తేలింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి తప్పు చేసిన ఉపాధ్యాయులపై చర్యలకు ఆదేశాలు జారీ చేస్తూ లేఖ రాశారు. అయితే ఆ లేఖలోని అంశాలు ఉపాధ్యాయులను కాకుండా విద్యాశాఖను తప్పుపట్టేలా ఉన్నాయి.
లేఖలో పేర్కొన్ ప్రకారం.. 13 మంది ఉపాధ్యాయుల జీతం Bed performance కారణంగా తగ్గించబడింది.Bad Performance కు బదులుగా Bed Performance అని లేఖలో పొరపాటున టైప్ చేయబడింది.ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. విషయం తెలుసుకున్న డీఈవో కార్యాల యం హడావుడిగా క్లారిటీ ఇచ్చింది. టైపింగ్ లోపం కారణంగా బ్యాడ్ పెర్పార్మెన్స్ అని బదులుగా బెడ్ ఫెర్మార్మెన్స్ అని టైప్ చేశారు. అని డీఈవో సంజాయిషీ ఇచ్చు కుంది.