కానీ, చాలా మంది EMI భారాన్ని చూసి భయపడి వెనక్కి తగ్గుతారు. అయితే, కొంత ప్లానింగ్ చేసుకుంటే ఈ భారాన్ని తగ్గించుకోవచ్చు. మీరూ కార్ కొనాలని అనుకుంటున్నా, EMI భారం భయపెడుతుందా? ఆ సమస్యను తొలగించడానికి కొన్ని సింపుల్ టిప్స్ మీ కోసం.
కార్ లోన్ పూర్తిగా అర్థం చేసుకోండి
కార్ లోన్ తీసుకునే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. చాలామంది కేవలం వడ్డీ రేటును మాత్రమే చూసి లోన్ తీసుకుంటారు, కానీ దాంతో పాటు మరికొన్ని ఛార్జీలు కూడా ఉంటాయి. ప్రాసెసింగ్ ఫీజు, ఫోర్‌క్లోజర్ ఛార్జ్, లేట్ ఫీ వంటి వాటిని ముందే తెలుసుకుని, మీ బడ్జెట్‌ను ప్లాన్ చేసుకుంటే భవిష్యత్తులో ఆర్థిక ఒత్తిడి రాదు.
అదనపు చెల్లింపులు అవకాశం దొరికినప్పుడు చేసేయండి
కార్ లోన్ త్వరగా పూర్తిచేయాలంటే, EMI కాకుండా అప్పుడప్పుడు అదనంగా చెల్లించడానికి ప్రయత్నించండి. బోనస్ రావడం, సేవింగ్స్ పెరగడం, ఊహించని ఆదాయం రావడం లాంటివి జరిగితే, దానిని లోన్ తక్కువ చేయడానికి ఉపయోగించండి. ఇలా చేస్తే వడ్డీ భారాన్ని కూడా తగ్గించుకోవచ్చు.
Related News
EMI మిస్ కాకుండా క్రమం తప్పకుండా చెల్లించండి
ఒక నెల EMI మిస్ అయితే అది మీ మొత్తం లోన్ మీద ప్రభావం చూపుతుంది. లేట్ ఫీజులు పడటమే కాకుండా, లోన్ గడువు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతీ నెల EMI సమయానికి చెల్లించండి. ఇంకా మంచి ఆప్షన్ ఏమిటంటే, ECS (Auto Debit) సెటప్ చేసుకుంటే ఎప్పుడూ లేట్ ఫీజు సమస్య ఉండదు.
అవసరం లేని ఖర్చులను తగ్గించండి
మీ కార్ లోన్ త్వరగా తీరాలంటే, కొన్ని అనవసర ఖర్చులను తగ్గించాలి. రెస్టారెంట్‌కి వెళ్లడం, అనవసరమైన షాపింగ్ చేయడం లాంటివి తక్కువ చేసి, ఆ డబ్బును EMI కోసం వాడండి. EMI మొత్తాన్ని పెంచి చెల్లిస్తే, లోన్ త్వరగా పూర్తవుతుంది.
ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే, మీ EMI భారం తగ్గించి, కార్ పూర్తిగా మీ సొంతం చేసుకోవచ్చు.