భద్రతా హామీతో ఆకర్షణీయమైన రాబడులు
కిసాన్ వికాస్ పత్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చిన్న పొదుపు పథకాల్లో ఒకటి. ఇందులో కనీసం ₹1,000 పెట్టుబడి పెట్టొచ్చు, అలాగే ఎంత పెట్టాలన్నా ఎలాంటి పరిమితి లేదు. ఇది ప్రధానంగా దీర్ఘకాలిక పెట్టుబడిదారుల కోసం రూపొందించబడింది. ప్రస్తుతం KVPపై 7.5% వడ్డీ అందుబాటులో ఉంది, ఇది త్రైమాసికంగా సంయోజితమవుతుంది. కేవలం 115 నెలల్లోనే డబ్బు రెట్టింపు అవుతుంది, అంటే 9 సంవత్సరాలు 5 నెలల్లోనే పెట్టుబడి రెండు రెట్లు అవుతుంది.
మీ పెట్టుబడి ఎంత పెరుగుతుంది?
KVPలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? అయితే ఎంత రాబడి వస్తుందో ముందుగా అర్థం చేసుకోవడం అవసరం. ఇందుకు KVP క్యాలికులేటర్ ఉపయోగించుకోవచ్చు లేదా కింది ఫార్ములా ద్వారా లెక్కించుకోవచ్చు. A = P (1 + r/n) ^ (nt). A = పరిపక్వత సమయంలో మొత్తం అందే మొత్తం. P = ప్రాథమిక పెట్టుబడి. R = వడ్డీ రేటు. T = పెట్టుబడి కాలం. N = సంవత్సరానికి వడ్డీ కూడబడే సార్లు
ఉదాహరణగా, మీరు ₹1 లక్ష పెట్టుబడి పెడితే, 7.5% వడ్డీ రేటుతో 115 నెలల తర్వాత అది ₹2 లక్షలుగా మారుతుంది
Related News
ఈ పథకంలో ఎవరైనా ఖాతా తెరవొచ్చు
ఈ స్కీమ్ ప్రత్యేకత ఏమిటంటే, 10 ఏళ్లు నిండిన పిల్లల పేరిట కూడా ఖాతా తెరవొచ్చు. ఒకరికి ఒకటి కాకుండా 2, 4 లేదా అంతకంటే ఎక్కువ ఖాతాలు కూడా ఓపెన్ చేయొచ్చు. అలాగే సింగిల్ ఖాతా, జాయింట్ ఖాతా రెండు రకాలుగా అందుబాటులో ఉన్నాయి.
పన్నుల గురించి మర్చిపోకండి
ఈ పథకంలో పెట్టుబడిపై రాబడికి పన్ను వర్తిస్తుంది, కాబట్టి ఖచ్చితమైన లాభాన్ని లెక్కించుకునే ముందు దీనిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
ఎందుకు కిసాన్ వికాస్ పత్రలో పెట్టుబడి పెట్టాలి?
భద్రతతో కూడిన పెట్టుబడి – ప్రభుత్వం హామీ ఇచ్చిన పథకం. ధీర్ఘకాలిక పెట్టుబడి – 9 సంవత్సరాలు 5 నెలల తరువాత డబ్బు రెట్టింపు. పెద్ద మొత్తంలో పెట్టుబడి అవకాశాలు – ఎన్ని ఖాతాలైనా తెరవొచ్చు. చిన్న స్థాయి పెట్టుబడిదారులకు అనువైనది – ₹1,000 నుంచి పెట్టుబడి ప్రారంభించవచ్చు ఈ పథకం పేరులో ‘కిసాన్’ అనే ఉన్నా, ఏ వ్యక్తైనా ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. దీర్ఘకాలికంగా పొదుపులు చేయాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం.
(Disclaimer: మీ పెట్టుబడులు పూర్తిగా మీ స్వంత బాధ్యత. పెట్టుబడి పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.)