భారతదేశంలోని ప్రభుత్వ రంగ మీడియా సంస్థ దూరదర్శన్, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలఅధికారిక కార్యక్రమాన్ని ఇందులోనే ప్రసారం చేస్తుంది, తెలుగు రాష్ట్రాలకి ఈ కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. ఈ ప్రసారాలు మాత్రమే కాదు, ప్రతి నెలా చివరి ఆదివారం భారత ప్రధానమంత్రి నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం కూడా ఇందులోనే ప్రసారం చేయటం జరుగుతుంది..
ఈ సంస్థ సీనియర్ కరెస్పాండెంట్ వుద్యోగం కొరకు ప్రసార భారతి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ వివరాలను తెలుసుకుందాం..
వివరాలు:
Post : సీనియర్ కరస్పాండెంట్ ఉద్యోగం, ఫుల్ టైం
ఉద్యోగ వర్గం : కాంట్రాక్ట్
అర్హతలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్ డిగ్రీ లేదా పిజి డిప్లొమా చేసి ఉండాలి.
అనుభవం: కనీసం 5 సంవత్సరాలు తప్పనిసరి.
వయోపరిమితి : 45 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి.
జీతం: నెలవారీ జీతం 80,000 నుండి 1,25,000 పే స్కేల్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.. https://applications.prasarbharati.org లో మీ వివరాలను నమోదు చేసుకుని, లాగిన్ అయి దరఖాస్తు చేసుకోండి.