గత ప్రభుత్వం లో ఉపాద్యాయులు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. సరైన జీతాలు లేక. PRC లో రావలసిన బకాయిలు రాక.. నాడు నేడు పేరిట COVID లో అనేక ఇబ్బందులు పడినారు.. అలానే గత ప్రభుత్వం ఏకంగా ఉద్యోగుల వల్ల మాకేం లాభం లేదు అని కూడా చాల సందర్బాలలో చెప్పిన మాట వాస్తవం..
GO 117 తో టీచర్ లు చాల నష్టపోయారు. అనేక స్కూల్స్ మూత పడ్డాయి. మరియు టీచర్ లు గత బదిలీల్లో సుదూర ప్రాంతాలకి వెళ్ళవలసి వచ్చింది.. వీటన్నిటి ఫలితమే తదుపరి ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూడవలసి వచ్చింది
ఈ నేపథ్యం లో అనకాపల్లి MP టీచర్ లను ఉద్దేసింది ఈ కింది విధం గా అన్నారు.
పొరపాటున కూడా టీచర్లతో ఏ రాజకీయపార్టీ లొల్లి పెట్టుకోకూడదని అనకాపల్లి MP సీఎం. రమేశ్ అన్నారు.
ఆదివారం అనకాపల్లిలో టీచర్స్ యూనియన్ నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలోని గత ప్రభుత్వం టీచర్స్తో గొడవపెట్టుకుని ఎన్నికల్లో బంగపడిందన్నారు.
సమాజంలో టీచర్లకు ఉన్నత స్థానముందని, అటువంటి స్థానాన్ని కించపరిచేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించరాదన్నారు