ప్రస్తుతం మన దేశంలో వైద్య ఖర్చులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఒక్కసారి హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే లక్షల రూపాయలు ఖర్చవుతాయి. అలాంటి సమయంలో ఆరోగ్య బీమా మనకు పెద్ద సహాయంగా ఉంటుంది. అయితే ఒక్కసారి బీమా పాలసీ తీసుకోవడం సరిపోదు. దాన్ని ప్రతి ఏడాది రిన్యూవ్ చేయాలి. కానీ రిన్యూవల్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం అవసరం. లేదంటే మీరు ఎన్నో లాభాలను కోల్పోతారు.
పరిశీలించాల్సిన కవరేజ్ డీటెయిల్స్
మీ బీమా పాలసీ ఎంతవరకు కవరేజ్ ఇస్తుందో తెలుసుకోవాలి. కొన్ని పాలసీలు రూమ్ రెంట్, ICU ఛార్జెస్, డాక్టర్ ఫీజు, మెడిసిన్లు, టెస్టులు, ఆపరేషన్ ఖర్చులు ఇలా మొత్తం కవరేజ్ ఇస్తాయి. మరికొన్ని మాత్రం కొన్ని ఖర్చులకు మాత్రమే పరిమితం అవుతాయి. కాబట్టి రిన్యూవల్ ముందు మీ పాలసీ కవరేజ్ డీటెయిల్స్ పూర్తిగా చదవాలి.
ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు
ఒకప్పుడు కేవలం హాస్పిటల్‌లో ఉన్న రోజులకు మాత్రమే బీమా వర్తించేది. కానీ ఇప్పుడు కొన్ని మంచి పాలసీలు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యే ముందు 30 రోజులు, డిశ్చార్జ్ అయిన తర్వాత 60 రోజులు దాకా ఖర్చులు కవరేజ్ చేస్తుంటాయి. మీరు తీసుకునే పాలసీ ఇలా ప్రీ, పోస్ట్ హాస్పిటలైజేషన్‌ను కవరేజ్ చేస్తుందా అని కన్ఫార్మ్ చేసుకోండి.
Related News
ప్రెస్క్రిప్షన్ల ఖర్చులు కవరేజ్‌లో ఉన్నాయా?
కొన్ని పాలసీలు మందుల ఖర్చులను కూడా కవరేజ్ చేస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఇది చాలా అవసరం. రెన్యూవల్ చేసే ముందు ఈ ఫీచర్ పాలసీలో ఉందా లేదా చెక్ చేయాలి.
నెట్‌వర్క్ హాస్పిటల్స్ జాబితా చూసుకోవాలి
మీ పాలసీ ఎన్ని నెట్‌వర్క్ హాస్పిటల్స్‌ను కలిగి ఉంది? అవి మీ దగ్గర ఉన్నాయా? ఈ విషయాన్ని గమనించండి. ఎందుకంటే కాష్‌లెస్ ట్రీట్‌మెంట్ పొందాలంటే తప్పకుండా నెట్‌వర్క్ హాస్పిటల్ అవసరం. లేదంటే మీరు ముందుగా డబ్బులు చెల్లించి తర్వాత క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తుంది.
ప్రీమియం పెరుగుతుందా? బోనస్ వస్తుందా?
పాలసీ రెన్యూవల్ సమయంలో పాత ప్రీమియంతోనే రెన్యూవ్ అవుతుందా, లేక కొత్త రేట్లు వర్తిస్తాయా అనే విషయాన్ని తెలుసుకోండి. అలాగే మీరు గత ఏడాది బీమా ఉపయోగించకుండా ఉండి ఉంటే, No Claim Bonus వస్తుందా లేక అదనంగా కవరేజ్ పెరుగుతుందా అని కూడా చెక్ చేయాలి.
వేటింగ్ పీరియడ్, ప్రీ-ఎగ్జిస్టింగ్ డిసీజ్ కవర్ అయిందా?
కొన్ని వ్యాధులకు బీమా పాలసీ మొదలుపెట్టిన వెంటనే కవరేజ్ ఉండదు. వాటికి కొన్ని నెలల లేదా సంవత్సరాల వేటింగ్ పీరియడ్ ఉంటుంది. మీరు గతంలో కవర్ కాని వ్యాధులు ఇప్పుడు కవరేజ్‌లోకి వచ్చాయా అని తెలుసుకోవాలి. ఇది ముఖ్యంగా రిన్యూవల్ చేస్తున్నపుడు పరిశీలించాల్సిన విషయం.
పాలసీ మారుస్తున్నారా? పోర్టబిలిటీ ఆప్షన్ గురించి తెలుసుకోండి
మీరు తీసుకున్న పాలసీ సరిగా పని చేయడం లేదు అనిపిస్తే, లేదా ఇంకొక కంపెనీ మంచి ఫీచర్లు ఇస్తోందని అనిపిస్తే మీరు పాలసీని పోర్ట్ చేయవచ్చు. అంటే కొత్త బీమా కంపెనీలోకి మార్చుకోవచ్చు. కానీ ఇలా మారేటప్పుడు కూడా మీరు అర్హతల గురించి, క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో గురించి, కస్టమర్ సపోర్ట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి.
ఆకర్షణీయమైన ఆఫర్లు వల్ల పాలసీ మార్చకండి
చాలా బీమా కంపెనీలు కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి తక్కువ ప్రీమియంతో పాలసీలు ఆఫర్ చేస్తుంటాయి. కానీ తక్కువ ప్రీమియం ఉన్నంత మాత్రాన అది మంచి పాలసీ అయి ఉండకపోవచ్చు. కవరేజ్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆఫర్ చూసి వెంటనే పాలసీ మార్చడం కాకుండా పూర్తి వివరాలు చూసి నిర్ణయం తీసుకోండి.
ఫైనల్ మెసేజ్
హెల్త్ ఇన్సూరెన్స్ రిన్యూవల్ ఒక చిన్న పని లా అనిపించొచ్చు. కానీ ఇది సరైన నిర్ణయం తీసుకోకపోతే మీకు భవిష్యత్తులో భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. మంచి కవరేజ్, సరైన ప్రీమియం, వాస్తవమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేట్ ఉన్న పాలసీని ఎంచుకోండి. ముఖ్యంగా కుటుంబానికి ఆరోగ్య భద్రత కావాలంటే ఇలా బాధ్యతతో నిర్ణయం తీసుకోవాలి.
ఇప్పుడే అప్రమత్తమవ్వండి, లేకపోతే లక్షల రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది.