
ఇప్పటి కాలంలో అందరూ అదనపు ఆదాయం కోసం వెతుకుతున్నారు. కానీ చాలా మంది పెద్ద పెట్టుబడి పెట్టాలంటే వెనకడుగు వేస్తున్నారు. కానీ ఇప్పుడు చెప్పబోయే బిజినెస్‌కు అస్సలు పెట్టుబడి అవసరం లేదు. మీరు బైక్ లేదా స్కూటీ నడిపగలిగితే, మీ ఫోన్‌లో వాట్సాప్ ఉంటే చాలు. నెలకు కేవలం 30 లీటర్ల పెట్రోల్‌తో మీరు రూ.50,000 వరకూ సంపాదించవచ్చు. ఇది కొత్తగా వచ్చిన “Property Watch Service” అనే బిజినెస్.
ఏంటి ఈ Property Watch Service
ఇప్పుడు ఇండియాలో ప్రతి ఒక్కరూ ఇల్లు కొనాలనే కలలుకంటున్నారు. ఎవరి ఆర్థిక స్థితి ఎలా ఉన్నా కనీసం ఓ ప్లాట్ అయినా కొనాలని చూస్తున్నారు. చాలామంది బ్యాంకు లోన్ల ద్వారా ఫ్లాట్లు, డూప్లెక్స్‌లు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఉద్యోగ మార్పులు, నగర మార్పులు వంటివల్ల వాళ్లు కొనుగోలు చేసిన ప్రాపర్టీని అక్కడే వదిలేసి వెళ్లిపోతున్నారు. అలాంటి వాళ్లకి ఆ ప్రాపర్టీ బాగానే ఉందా? ఎవరైనా అక్రమంగా వినియోగించుకుంటున్నారా? అనే టెన్షన్ మొదలవుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో “Property Watch Service” బిజినెస్ చాలా అవసరమైనదిగా మారింది. మీరు చేయాల్సిందేమంటే – ప్రతి వారం లేదా నెలలో ఒక్కసారి ఆ ప్రాపర్టీ దగ్గరికి వెళ్లి, ఆ ఇంటి ఫోటోలు తీయాలి. ఆ ఫోటోలను వాట్సాప్ ద్వారా ఇంటి యజమానికి పంపాలి. అవసరమైతే వీడియో కాల్ ద్వారా లైవ్‌లో ఇంటి పరిస్తితిని చూపించవచ్చు. ఇది చాలా సింపుల్ అయినా, యజమానులకు ఎంతో శాంతినిచ్చే సర్వీస్.
[news_related_post]ఎవరు చేయొచ్చు
ఈ బిజినెస్‌కి పెద్దగా టైం అవసరం ఉండదు. చదువుతున్న కాలేజ్ స్టూడెంట్స్, గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నవాళ్లు ఈ సర్వీస్‌ను టైమ్ ఫ్లెక్సిబుల్‌గా చేసుకోవచ్చు. ఎలాంటి మానవ శ్రమ అవసరం లేదు. మీరు పెట్రోల్ ఖర్చే కాకుండా, మీ సమయాన్ని కూడా ఆదా చేసుకుంటారు. మొదట్లో సోషల్ మీడియాలో ప్రమోషన్ చేయడం ద్వారా క్లయింట్లు సంపాదించవచ్చు. ఒకసారి 100 కస్టమర్లు వచ్చాక, వాళ్ల ద్వారా చాలా మంది రిఫరల్స్ కూడా వస్తాయి.
ఆదాయం ఎలా?
ఈ బిజినెస్‌లో ఆదాయం ఎలా వస్తుంది? మీరు ప్రతి ప్రాపర్టీకి వెళ్ళే దూరాన్ని బట్టి ఫ్యూయల్ ఖర్చు ఎంత అయ్యిందో దానిని బేస్ చేసుకొని ఫీజు వసూలు చేయొచ్చు. ఉదాహరణకి, మీరు ఒకే ట్రిప్‌లో 4-5 ప్రాపర్టీస్‌కి వెళితే, ఒక్కో యజమానితో ప్రయాణ ఖర్చు డివైడ్ చేసుకొని ఫీజు తీసుకోవచ్చు. ఇలా రోజుకు 4-5 ప్రాపర్టీస్ చూడగలిగితే నెలకి రూ.50,000 వరకూ సంపాదించవచ్చు. ఈ బిజినెస్‌కు స్టార్టింగ్ ఖర్చు లేని బిజినెస్‌గా గుర్తింపు వస్తోంది.
మీ వద్ద బైక్/స్కూటీ, ఫోన్, వాట్సాప్ ఉంటే చాలు – ఈ బిజినెస్‌ను వెంటనే స్టార్ట్ చేయవచ్చు. ఎలాంటి రిస్క్ లేకుండా, ప్రభుత్వ చట్టాలకి లోబడే ఉండే ఈ స్మార్ట్ సర్వీస్‌తో మీరు ఒక మార్గాన్ని సృష్టించుకోవచ్చు. 2025 లో ఇది ట్రెండ్‌గా మారుతోంది. మీరు కూడా ఇప్పుడు ప్రారంభించి, రేపటి లీడర్‌గా ఎదగండి.