భారతీయ రైల్వేలు ప్రతిరోజూ దాదాపు 13,000 రైళ్లను నడుపుతున్నాయి. దేశంలో రైల్వే స్టేషన్ల సంఖ్య 8,800 దాటింది.. రైల్వే లైన్ల పొడవు 1,26,366 కి.మీ. ఉత్తరప్రదేశ్‌లో రైలు నెట్‌వర్క్ పొడవు 9,077.45 కి.మీ.గా నమోదైంది. ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ మన భారతీయ రైల్వేలు. ప్రతిరోజూ, రైళ్లు లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తాయి. దేశంలోని వేల గమ్యస్థానాల మధ్య ప్రయాణించే ఈ రైళ్ల కదలికలో జాప్యాలు అర్థమయ్యేవే.
కానీ, అదే ఆలస్యంలో ఒక రైలు ప్రపంచ రికార్డు సృష్టించింది. అవును..మీరు విన్నది నిజమే.. ఒక రైలు ఒకటి లేదా రెండు గంటలు ఆలస్యం కాదు. పోనీ 5 గంటలు కూడా ఆలస్యం కాదు.. 72 గంటలు ఆలస్యం అయితే.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అనధికారిక రైల్వే వివరాల ప్రకారం.. 2017లో రాజస్థాన్‌లోని కోటా నుండి పాట్నాకు వెళ్లాల్సిన రైలు నంబర్ 13228 అత్యంత ఆలస్యంగా నడిచిన ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఆలస్యం అంటే అది సాధారణం కాదు కానీ 72 గంటలు ఆలస్యం. అయితే, అధికారిక రైల్వే వివరాల ప్రకారం.. ఆ చెత్త రికార్డు మహానంద ఎక్స్‌ప్రెస్ పేరు మీద ఉంది. డిసెంబర్ 2014లో ఈ మహానంద ఎక్స్‌ప్రెస్ మొఘల్‌సరాయ్-పాట్నా మధ్య 71 గంటలు ఆలస్యంగా నడిచింది.