ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO-ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ).. ఎంప్లాయిస్ పెన్షన్ స్కీంను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇది దేశంలోనే అతిపెద్ద సామాజిక భద్రత పథకాల్లో ఒకటి అని చెప్పవచ్చు. దీన్ని 1995, నవంబర్ 16న లాంచ్ చేశారు. సంఘటిత రంగంలో ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు స్థిరాదాయం అందించాలన్న ఉద్దేశంతో ఈ ఈపీఎస్ పథకం ఏర్పాటయిందని చెప్పవచ్చు. ఈ స్కీం కింద ఉద్యోగులు సర్వీస్ పిరియడ్ సహా వారి శాలరీని బట్టి రిటర్మెంట్ తర్వాత నెల నెల పెన్షన్ అందుకుంటారు. ఇప్పుడు ఈ పిఎఫ్ ఏంటి.. ఎన్నేళ్ల సర్వీస్ పై పెన్షన్ ఎంత జీతం పై ఎంత వస్తుందనేది తెలుసుకుందాం.
ఈపీఎస్ కింద పెన్షన్ పొందాలనుకుంటే దాదాపు ఇందులో పదేళ్లపాటు సర్వీస్ ఉండాలి. అంతేకాకుండా 58 ఏళ్లు దాటి ఉండాలి. ముఖ్యంగా ఈపీఎఫ్ఓ పేరు కూడా నమోదు అయ్యి ఉండాలి. ఉద్యోగం చేసే సమయంలో ఈపీఎఫ్వోకు కాంట్రిబ్యూషన్ కచ్చితంగా ఉండాలి. అప్పుడు మాత్రమే రిటర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది. సాధారణంగా వేతనం నుంచి 12 శాతం ఈపీఎఫ్ అకౌంట్ కు వెళ్తుంది. కంపెనీ కూడా జమ చేస్తే 12 శాతం లో 8 శాతానికి పైగా ఈపీఎస్ స్కీంకు వెళ్తుండగా మూడు శాతానికి పైగా మాత్రం ఈపీఎఫ్ కు వెళ్తుంది. ఇక 2014 నుంచి కనీస పెన్షన్ 1000 గరిష్ట పెన్షన్ 7500 గా ఉంది.
Related News
పదేళ్ల సర్వీస్ చేసిన వారికి పదవి విరమణ తర్వాత పిఎఫ్ ఎంత వస్తుందో ఈ ఫార్ములా ద్వారా తెలుసుకుందాం
మంత్లీ పెన్షన్ = {(పెన్షనబుల్ శాలరీXపెన్షనబుల్ సర్వీస్)/70}
పెన్షనబుల్ శాలరీ అంటే.. ఇది గత 60 నెలల సగటు వేతనం (గరిష్ట పరిమితి రూ. 15 వేలుగా ఉంది.) అర్థం. ఇక పెన్షనబుల్ సర్వీస్ అంటే.. మీరు పని చేసిన కాలం. అయితే దీనిని బట్టి పైఫార్ములా ద్వారా పదేళ్ల సర్వీసుపై పెన్షన్ ఎంత వస్తుందో తెలుసుకోవచ్చు. మంత్లీ పెన్షన్ = {(రూ. 15000X10)/70}= రూ. 2143. అంటే.. ఇక్కడ పదేళ్ల సర్వీసులో కూడా నెలవారీగా రూ. 2143 చొప్పున పెన్షన్ పొందొచ్చు. ఒకవేళ 35 సంవత్సరాల సర్వీసు కనుక ఉంటే.. అప్పుడు రూ. 15000X35/70= రూ. 7500 గరిష్ట పెన్షన్ అందుకోవచ్చు. మరోవైపు.. గరిష్ట వేతన పరిమితి రూ. 15 వేలుగా ఉంది. దీనిని రూ. 21 వేలకు పెంచొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే పెన్షన్ కూడా పెరిగే అవకాశం ఉంది.