ఈ వ్యాపారం ఎలా పని చేస్తుంది?
నేటి డిజిటల్ యుగంలో, స్మార్ట్‌ఫోన్ ఒక కెమెరా మాత్రమే కాదు, అది సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయగలిగే పవర్‌ఫుల్ టూల్‌గా మారింది. మొబైల్ సినిమాటోగ్రఫీ అనే కొత్త ఒరవడి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవలి కాలంలో, ఒక మొబైల్ కెమెరాతో తీసిన సినిమా ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శింపబడింది, దీనికి మంచి గుర్తింపు వచ్చింది.
మొబైల్ సినిమాటోగ్రఫీ ఎక్విప్‌మెంట్ రెంటల్ బిజినెస్
చాలా మంది యాక్టర్లు, డైరెక్టర్లు తమ కలలను నెరవేర్చడానికి సరైన ఎక్విప్‌మెంట్ లేక ఇబ్బంది పడుతున్నారు. పెద్ద సినిమాలు, వెబ్ సిరీస్‌లను నిర్మించేందుకు కూడా ఎక్విప్‌మెంట్ రెంట్ పై ఆధారపడతారు. ఈ పరిస్థితిలో, మీరు “మొబైల్ సినిమాటోగ్రఫీ ఎక్విప్‌మెంట్ రెంటల్ బిజినెస్” ప్రారంభించడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.
ఈ బిజినెస్ ప్రత్యేకత ఏమిటి?
ఇది కాలేజ్ స్టూడెంట్స్, కంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నవారికి కష్టంలేకుండా చేయగలిగే బిజినెస్. ఎక్కువగా యాక్టర్స్, డైరెక్టర్స్ కాలేజీల నుంచే వస్తారు. కాబట్టి, కస్టమర్లను వెతుక్కోవాల్సిన అవసరం చాలా తక్కువ. మార్కెట్ డిమాండ్ అధికంగా ఉండటంతో పోటీ తక్కువగా ఉంటుంది.
Related News
లాభాలు ఎలా వస్తాయి?
ఈ బిజినెస్‌ను మొదలుపెట్టడానికి ప్రధానంగా ₹5 లక్షల పెట్టుబడి అవసరం. ఈ పెట్టుబడితో హై క్వాలిటీ మొబైల్ సినిమాటోగ్రఫీ ఎక్విప్‌మెంట్, అవి సురక్షితంగా ఉండేందుకు అవసరమైన ఫర్నిచర్ కొనుగోలు చేయవచ్చు. ఒకసారి బిజినెస్ స్థిరపడిన తర్వాత, నెలకు కనీసం 20 రోజులు రెంట్‌కు ఇచ్చినట్లయితే, రూ.1 లక్ష వరకు ఆదాయం రావచ్చు. పోటీ అధికంగా ఉన్నప్పటికీ, రెంటల్ ఛార్జీలు ఎక్కువగానే ఉంటాయి.
ఇది ఒకసారి మొదలుపెడితే, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా, మంచి ఆదాయం తెచ్చిపెట్టే బిజినెస్. స్మార్ట్‌ఫోన్‌ను వాడుతూ వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది ఉత్తమ అవకాశంగా మారొచ్చు.