భానుడి ప్రతాపానికి దేశ వ్యాప్తంగా ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో, డెలివరీ ఏజెంట్ల శ్రేయస్సు కోసం Zomato తన కస్టమర్లకు కీలక సూచన చేసింది.
మధ్యాహ్నం పూట అత్యవసరమైతే తప్ప ఆర్డర్లు ఇవ్వవద్దని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది.
దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. చాలా మందికి ఈ అప్పీల్ కొంత వింతగా అనిపిస్తుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్నవారు, వృద్ధుల పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నించారు.
మరికొందరు మనకు ఆకలిగా ఉన్నప్పుడే ఆర్డర్ చేసేది అని అడిగారు. మరికొందరు మధ్యాహ్నం ఆహార పంపిణీకి తాత్కాలిక విరామం ప్రకటించాలని సూచించారు.