పాఠశాలలో టీచర్ లు విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని వారిని అప్పుడప్పుడు దండించటం జరుగుతుంది. అయితే ప్రస్తుతం పిల్లలని దండించాలంటే ఉపాధ్యాయులకు ధైర్యం చాలటం లేదు. ఎందుకంటే తల్లి దండ్రులు వారి పిల్లలమీద చూపే అతి ప్రేమ .. దాని వల్ల సదరు పిల్లవాడి పేరెంట్స్ ఆ టీచర్ మీదకు దాడికి వాళ్ళటమో లేదా కేసులు పెట్టడమో మనం ఈ మధ్య తరచూ చూస్తూ ఉంటాము. అయితే కేరళ హై కోర్ట్ ఈ మధ్య సంచలన తీర్పు ఇచ్చింది .
క్రమశిక్షణ పెంపొందించాలన్న సదుద్దేశంలో విద్యార్థులను కొట్టే ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు పెట్టకూడదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.
తొత్తువలోని సెయింట్ జోసఫ్ స్కూల్ ప్రిన్సిపాల్, అక్కడి ఇంగ్లిష్ టీచరు జోమీపై పెట్టిన కేసులను కొట్టివేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ పాఠశాలలో 8వ తరగతి చదివే 13 ఏళ్ల విద్యార్థినికి మంచి మార్కులు రాకపోవడంతో ఆమెను టీచరు జోమీ కొట్టారు.
దాంతో తల్లిదండ్రులు ఆమె పైనా, పాఠశాల ప్రిన్సిపాల్పైనా కొడనాడ్ పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 75 కింద నేరం చేసినట్టు పేర్కొన్నారు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు.
ఆ బాలికను దండించడంలో ఎలాంటి దురుద్దేశాలు లేవని తెలిపారు. ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు.