Optical illusion అంటే మనకి కనపడే దృశ్యం మన మైండ్ తో ఆటలు ఆడుతుంది. మనం చూస్తున్నది నిజంగా అలా ఉందా? లేదంటే మన కళ్ళు మాయ చేస్తున్నాయా? అనే సందేహాలు రేపే రకమైనవి ఇవి.
ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ కుక్కల-themed పజిల్ కూడా అలాంటిదే. ఈ చిత్రాన్ని చూసినవారంతా ఒక్కసారి కాదు, పలుమార్లు చూస్తున్నారు. ఎందుకంటే, ఇది ఓ సింపుల్ “Eye Test” లాగానే కనిపిస్తుంది కానీ… అసలు విషయం అంత సులభం కాదు.
ఈ పజిల్‌ను Facebook లోని Minion Quotes పేజ్ షేర్ చేసింది. మొదట్లో ఇది ఓ కుక్క ఆకృతి గల నలుపు చిత్రం లాగా కనిపిస్తుంది. కానీ దగ్గరగా చూసినప్పుడు, ఈ సిల్హౌట్‌లో మరిన్ని కుక్కలు దాగి ఉన్నాయి. ఒక్కోసారి ఒక్క కుక్కే కనిపిస్తుంది, మరొకసారి ఏకంగా 7 కుక్కలు కనిపిస్తాయి. అంతా మన కళ్ళమీద, మన అవగాహన మీద ఆధారపడి ఉంటుంది.
Related News
ఈ చిత్రం మానవ చూపు, గమనిక, ఊహా శక్తిని పరీక్షించేందుకు ఉపయోగపడుతుంది. మొదటిసారి చూసినప్పుడు మనకు ఓ కుక్కే కనిపించవచ్చు. కానీ మళ్లీ మళ్లీ చూస్తే… చెవులు, తోకలు, కాళ్లు వేరుగా కనపడతాయి. అవే మిగతా కుక్కలను చూపే సంకేతాలు అవుతాయి.
సోషల్ మీడియాలో ప్రజల స్పందన చాలా ఆసక్తికరంగా ఉంది. “ఐదు కుక్కలు కనిపించాయి అనుకుంటే… ఇంకొన్నింటిని మిస్ చేశానని తెలిసింది!” అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. మరొకరు “ఇది మైండ్ గేమ్‌లా ఉంది… ప్రతిసారి చూస్తే కొత్తగా కనిపిస్తుంది!” అంటున్నారు.
ఇలాంటి ఇల్యూషన్స్ మనకు ఓ మంచి లెస్సన్ నేర్పిస్తాయి. మనం రోజూ ఏదైనా చూడగానే నిర్ణయం తీసుకోవడం కాదు… కొన్ని విషయాలు దగ్గరగా చూసినప్పుడే అసలైన నిజం బయటపడుతుంది. మీరు ఈ కుక్కల చిత్రాన్ని ఇంకా ఒక్కసారి పరిశీలించండి… మొత్తం ఎన్ని కుక్కలు కనిపిస్తున్నాయో చెప్పగలరా?
జవాబు
మీకు సమాధానం అర్థమయింది కదా. ఇప్పుడు ఇది పిక్చర్ ని మీరు మీ స్నేహితులతో షేర్ చేసి వారి జవాబు వినండి. ఆసక్తితో సరైన జవాబు ని మీరు ప్రదర్శించండి.