SBI ప్రత్యేక FD స్కీమ్‌లు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రెండు ప్రత్యేక FD స్కీమ్‌లను అందిస్తోంది:
1. అమృత వృష్టి FD స్కీమ్: 400 రోజుల FD పై సాధారణ ఖాతాదారులకు 7.25% వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 7.75% వడ్డీ 2. అమృత కలశ్ FD స్కీమ్: 400 రోజుల FD పై సాధారణ ఖాతాదారులకు 7.10% వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 7.60% వడ్డీ. ఈ రెండు స్కీమ్‌లు మార్చి 31, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
IDBI స్పెషల్ ఉత్సవ్ FD స్కీమ్
IDBI బ్యాంక్ కూడా మార్చి 31 తర్వాత ముగియనున్న ప్రత్యేక FD స్కీమ్‌ను అందిస్తోంది. ఇందులో ఐదు భిన్నమైన టెన్యూర్ ఆప్షన్‌లు ఉన్నాయి: 300 రోజులు – 7.05% వడ్డీ, ,375 రోజులు – 7.25% వడ్డీ, 400 రోజులు – 7.35% వడ్డీ, 555 రోజులు – 7.40% వడ్డీ, 700 రోజులు – 7.20% వడ్డీ, సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50% వడ్డీ ఉంటుంది. సూపర్ సీనియర్ సిటిజన్లకు 15% అదనపు వడ్డీ లభిస్తుంది (300 రోజుల FD మినహా).
Related News
HDFC ప్రత్యేక FD స్కీమ్
ప్రభుత్వేతర బ్యాంకులలో అగ్రస్థానంలో ఉన్న HDFC బ్యాంక్ కూడా ప్రత్యేక FD అవకాశాలను అందిస్తోంది. 35 రోజుల FD – సాధారణ ఖాతాదారులకు 7.35%, సీనియర్ సిటిజన్లకు 7.85%, 55 నెలల FD – సాధారణ ఖాతాదారులకు 7.40%, సీనియర్ సిటిజన్లకు 7.90%. ఈ స్కీమ్‌లో రూ. 3 కోట్లు లోపు FDలు మాత్రమే చేయడానికి అనుమతించబడతాయి. కనీస పెట్టుబడి రూ. 5,000 ఉండాలి.
ఎక్కువ లాభాల కోసం త్వరగా నిర్ణయం తీసుకోండి
ఈ ప్రత్యేక FD స్కీమ్లలో మార్చి 31, 2025 తర్వాత అందుబాటులో ఉండకపోవచ్చు. కనుక ఇప్పుడు పెట్టుబడి పెడితే అధిక వడ్డీ లాభాలను పొందవచ్చు. బ్యాంకుల మధ్య వడ్డీ రేట్లను పోల్చుకుని మీ అవసరానికి సరిపోయే FD ఎంపిక చేసుకుని మంచి రాబడిని అందుకోవచ్చు.