ఈ మధ్య కాలంలో చాలా మందికి తెల్ల జుట్టు పెద్ద సమస్యగా మారింది. వృద్ధులే కాదు వయసులో ఉన్న వారు కూడా తెల్ల వెంట్రుకలతో బాధపడుతున్నారు.
ముఖ్యంగా 30 ఏళ్లలో కొందరిలో జుట్టు నెరిసిపోతుంది. అయితే తలపై తెల్ల వెంట్రుకలు వచ్చినప్పుడు వాటిని కప్పి ఉంచేందుకు చాలా మంది మార్కెట్ లో లభించే హెయిర్ డైని వాడుతుంటారు. కానీ అవి చాలా రసాయనాలతో నిండి ఉన్నాయి. అవి అనేక సమస్యలను కలిగిస్తాయి.
అయితే ఇప్పుడు చెప్పబోయే హోం రెమెడీని ట్రై చేస్తే తెల్లజుట్టును సహజంగా నల్లగా మార్చుకోవచ్చు. ఎటువంటి దుష్ప్రభావాలను కలిగి ఉండదు. ఆలస్యమెందుకు, నివారణోపాయం ఏమిటో తెలుసుకుందాం.
Related News
ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో ఒక గ్లాసు నీళ్లు పోయాలి. నీళ్లు వేడయ్యాక అందులో రెండు టేబుల్ స్పూన్ల టీపొడి, ఐదారు లవంగాలు వేసి పది నిమిషాలు మరిగించాలి.
ఇప్పుడు కషాయాన్ని స్టయినర్ సహాయంతో ఫిల్టర్ చేసి చల్లార్చాలి. దీనికి ముందు, ఒక బీట్‌రూట్ నుండి రసాన్ని తీయండి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల హెన్నా పౌడర్, రెండు టేబుల్ స్పూన్ల ఉసిరి పొడి, రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్ వేయాలి. అలాగే అరకప్పు బీట్ రూట్ జ్యూస్, అరకప్పు టీ డికాక్షన్ వేసి అన్నీ కలిపి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అరగంట పాటు పక్కన పెట్టండి.
అరగంట తర్వాత, మిశ్రమాన్ని మూలాల నుండి చివరల వరకు అప్లై చేసి, షవర్ క్యాప్ ధరించండి. ఒక గంట తర్వాత, మీ తలని తేలికపాటి షాంపూతో కడగాలి. మీరు వారానికి ఒకసారి ఈ రెమెడీని అనుసరిస్తే, మీ జుట్టు సహజంగా నల్లగా మారుతుంది. ఈ రెమెడీ జుట్టులో మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. తెల్ల జుట్టును ఎఫెక్టివ్‌గా నివారిస్తుంది. కాబట్టి 30 ఏళ్లకే తెల్లజుట్టు రావడం మొదలైందని బాధపడేవారు ఈ రెమెడీని తప్పక ప్రయత్నించాలి.