BIG BREAKING: డిప్యూటీ సీఎం పవన్‌కు ప్రాణహాని.. జనసేన ఆఫీస్​పై ఎగిరిన డ్రోన్లు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంప్ ఆఫీస్ పై డ్రోన్ కలకలం సృష్టించింది. ఆ డ్రోన్ 20 నిమిషాల పాటు ఆఫీసు చుట్టూ తిరుగుతూనే ఉంది. డ్రోన్ మధ్యాహ్నం 1:30 నుండి 1:50 వరకు ఎగిరిందని పార్టీ నాయకులు చెబుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

పవన్ పై దాడికి కుట్ర జరుగుతుందని జనసేన నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డీజీపీ, గుంటూరు జిల్లా ఎస్పీ, కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

గతంలో పవన్ కళ్యాణ్ హాజరైన ఒక కార్యక్రమంలో నకిలీ ఐపీఎస్ అధికారి బయటపడటం కూడా సంచలనం సృష్టించింది. మరోసారి పవన్ కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇలాంటి వరుస సంఘటనల నేపథ్యంలో పవన్ భద్రతపై జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Related News