Tirumala:భక్తుల రద్దీ సాధారణం.. దర్శనానికి ఎంత సమయం..?

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిని చూడటానికి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ కారణంగా కొన్నిసార్లు భక్తుల రద్దీ సాధారణంగా ఉంటుంది. మరికొన్నిసార్లు అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో నేడు (సోమవారం) తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంటుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి 12 గంటలు పడుతుంది. నిన్న (ఆదివారం) 79,478 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 26,667 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల రూపంలో హుండీ ఆదాయం రూ.4.05 కోట్లు అని టిటిడి అధికారులు తెలిపారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now